పోలవరం కీలక పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. మే చివరినాటికి కాఫర్‌ డ్యాం పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేసారు. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్, అప్‌ స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం పై సమీక్షలో సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు.

స్పిల్‌ వే పూర్తికాకుండా.. కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయి అని సిఎం అన్నారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారన్న దానిపై సీఎం వద్ద చర్చ జరిగింది. గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు 13 మీటర్లు వరద ప్రవాహం ఉందని అధికారులు  పేర్కొన్నారు. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద  గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 లలో  భారీ ఎత్తున కోతకు గురైందని వెల్లడించారు. ఫలితంగా వరదల సమయంలో స్పిల్‌ఛానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం కలిగిందని అన్నారు.

స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని సీఎంకు అధికారులు వివరించారు. గేట్లు, సిలిండర్ల బిగింపు స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను పై సీఎం అరా  తీసారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలి, వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపాలి అని జగన్ సూచించారు. మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేసారు. పోలవరం సహాయపునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఎత్తు తగ్గింపు లేదు... అది వీలుకాదు అని సీఎం తో అధికారులు స్పష్టం చేసారు. ఎత్తు తగ్గింపుపై చర్చలు, ప్రతిపాదనలు కుదరవని సెంట్రల్‌ వాటర్‌కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విస్పష్టంగా చెప్పాయి అని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: