ప్రస్తుత టెక్నాలజీ, డిజిటల్ కాలంలో ఎన్నైనా వింతలు జరగోచ్చు. తాజాగా అలాంటి వింతే జరిగింది. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఆడియో క్లిప్‏ను లండన్‏కు చెందిన ఓ వ్యక్తి దాదాపు రూ. 48.4 కోట్లకు (66.6 మిలియన్స్) కోన్నాడు. అవును ఇది అక్షరాల నిజం.

వివరాల్లోకెళితే.. మయామిలో నివసించే అమెరికా వ్యక్తి ఆర్ట్ కలెక్టర్ పాబ్లో రోడ్రిగెజ్ ఫ్రేలే గతేడాది 67,00 డాలర్లు (49.23 లక్షలు) ఖర్చు చేసి ఓ వీడియోను రూపొందించాడు. అయితే గత వారం ఆ పది సెకన్ల నిడివి ఉన్న వీడియోను లండన్‏కు చెందిన ఓ వ్యక్తి దీనిని రూ.48.4కోట్లకు కోనుగోలు చేశాడు.

వీడియోలోని స్పెషల్..
ఇదిలా ఉండగా ఈ వీడియో ఆర్టిస్ట్ బీపుల్ నాన్ ఫంగబుల్ టోకెన్ అనే సరికొత్త డిజిటల్ విభాగం బ్లాక్ చెయిన్ ద్వారా రూపొందించారు. సంప్రదాయ ఆన్ లైన్ వస్తువులుగా కాకుండా.. ఇందులో కొత్తగా డిజైన్స్ క్రియేట్ చేసి వీడియోను  రూపొందించే సదుపాయాలున్నాయి. ఇక పది సెకన్ల నిడివి ఉన్న  ఈ వీడియోలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేలమీద పడుకున్నట్లుగా ఉండి.. అతని శరీరం మొత్తం నినాదాలతో ముద్రించి ఉంటుంది. కానీ అక్కడి ప్రజలు అదేం పట్టనట్లుగా దాని పక్కన నుంచే వెళ్తుంటారు. ఈ వీడియోను రాయిటర్స్ అనే ట్విటర్ యూజర్ తన ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. పది సెకన్ల ఈ వీడియో క్లిప్ 66.6 మిలయన్లకు కొనుగోలు చేయబడింది. ఆసక్తి ఉన్నవారితోపాటు, వస్తువులపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కోసం ఆన్ లైన్ లో నాన్ ఫంగబుల్ టోకెన్ అనే సరికొత్త డిజిటల్ అస్సెట్ బాగా డిమాండ్ లో ఉంది అంటూ చెప్పుకోచ్చారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 6.7 కే లైక్స్, 2.8కే కామెంట్స్ వచ్చాయి. మరీ మీరు ఆ వీడియో వైపు ఓ లుక్కెయ్యండి.





మరింత సమాచారం తెలుసుకోండి: