ఎన్నికలు అంటేనే ఎన్నో జరుగుతూంటాయి. ప్రతీ సారి ఎన్నికల్లో కొత్త చిత్రాలు కూడా తెర మీదకు వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం పట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇపుడు సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో గుక్క తిప్పుకోలేకపోతోంది

విశాఖలో కొన్ని వార్డుల్లో కార్పొరేటర్ టికెట్ ని పార్టీ పెద్దలు అమ్ముకున్నారంటూ తమ్ముళ్ళు ఏకంగా వీధుల్లోకి వచ్చి ఆరోపణలు చేయడంతో ఎన్నికల వేళ టీడీపీఎకి ఇది అతి పెద్ద ఇరకాటంగా మారుతోంది. పార్టీని నమ్ముకున్న వారిని మోసగించి వ్యక్తులను నమ్ముకున్న వరికే టీడీపీ టికెట్లు కేటాయించిందని 31వ్ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ దొడ్డి బాపూ ఆనంద్ విమర్శించడంతో పసుపు పార్టీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మీదనే తమ్ముళ్ళు మండుతున్నారు. కష్టపడిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పి తీరా అనర్హులకు ఇవ్వడాన్ని ఏ విధనా అర్ధం చేసుకోవాలని వారు నిలదీస్తున్నారు.  గత ఏడాది పార్టీ అభ్యర్ధిగా  బీ ఫారం ఇచ్చి ఇపుడు తప్పించడంలో సీక్రెట్ ఏంటో చెప్పాలని కూడా తమ్ముళ్ళు నిలదీస్తున్నారు.  టికెట్ కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలని కూడా టీడీపీలో కొందరు పెద్దలు పట్టుబట్టారని తమ్ముళ్ళు బాహాటంగా చెబుతూండడం విశేషమే.

విశాఖలో గెలిచే అవకాశాలు ఉన్న వారిని తప్పించి డబ్బులు ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నారని, ఇలాగైతే టీడీపీ ఎలా బతికి బట్టకడుతుదని తమ్ముళ్ళు మండిపడుతున్నారు. చాలా చోట్ల ఇలాగే జరిగిందని అంటున్నారు. గతంలో టికెట్లు ఇచ్చి ఇపుడు తప్పించడం వెనకాల మతలబు ఏంటో చెప్పాలని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే టికెట్లు అమ్ముకున్నారంటూ లొల్లి టీడీపీకి బిగ్ షాక్ గా మారిందని అంటున్నారు. అసలే అధికార పార్టీతో గట్టి పోటీని ఎదుర్కొంటున్న టీడీపీకి ఇలా సొంత పార్టీ నేతలు ఎదురుతిరగడం ఇబ్బందికరమే అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: