దేశంలో ఆక్సిజన్ నిల్వలు రోజు రోజుకూ తగ్గి పోతున్నాయి.  కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతున్న నేపథ్యం లో ఎంతో మంది రోగులు ఆస్పత్రి ఫాలవుతున్నారు  ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది లాంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యం లో చాలా మంది రోగులకు ఆక్సిజన్ అందించడం తప్పని సరిగా మారి పోయింది  ఇలాంటి నేపథ్యం లో రోజు రోజుకు దేశం లో ఆక్సిజన్ కొరత ఏర్పడడం తో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు కరోనా రోగులు.



 అయితే ఇక దేశ వ్యాప్తం గా ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యం లో ఆక్సిజన్ నిల్వలు మాత్రం అంతకంతకూ తగ్గి పోతున్నాయి.  ఇలాంటి నేపథ్యం లోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చి ప్రజలందరికీ ఆక్సిజన్ అందుబాటు లో ఉండే విధం గా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.  ఇక ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో  ఒకటిగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆక్సిజన్ విషయం లో ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.




 ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ప్రతి జిల్లాలో కూడా కాన్సెంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధమైంది. అంతే కాకుండా కరోనా వైరస్ బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న కరోనా వైరస్ రోగులకు ఇక ఇంటికే కాన్సన్ట్రేటర్ డెలివరీ చేసేందుకు సిద్ధం అయింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతం గా పెరిగి పోవడం తో ఏప్రిల్ 19వ తేదీ నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించింది. ఇక అప్పటినుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య రాష్ట్రం లో క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: