సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త, తాజాగా తిరిగి మాన్సస్ చైర్మన్ గా నియమింపబడిన అశోక్ గజపతిరాజు ఈరోజు సింహాచల అప్పన్నను దర్శనం చేసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్వికులు ఇచ్చిన ధర్మాన్ని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆయన అన్నారు. మన మతాన్ని ఆరాధించాలి ఎదుటివారి మతాన్ని గౌరవించాలని పేర్కొన్న ఆయన ఇప్పుడు ఆ సూత్రం లోపించినట్లు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్న ఆయన తనని దేవాలయాల సంరక్షణలో విఫలమయ్యానని మూడు దేవాలయాల నుంచి తొలగించారని కానీ విధ్వంసాల విషయంలో మాత్రం తన మనసు చాలా గాయమైందని అన్నారు. 


విధ్వంసాలు విషయంలో ఒక్కరినైనా పట్టుకోగలిగారా అని ప్రశ్నించిన ఆయన దేవాలయాల దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటోంది ? వాటిని సంరక్షణ కోసమే కదా అని ప్రశ్నించారు. రామతీర్థం దేవాలయానికి ఆలయ అనువంశిక ధర్మకర్తనయిన తనను పంపించలేదు కానీ జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉన్న ఒక దొంగను పంపించారని ఆయన ఆరోపించారు. తాను ధర్మకర్త హోదాలో విగ్రహాల తయారీకి లక్ష రూపాయలు ఇస్తే వద్దన్నారని ఇలా ఆలయ అనువంశిక ధర్మకర్తలతో ఆడుకోవడం సరి కాదని ఆయన అన్నారు. హిందువులు బిచ్చగాళ్లు కాదని పేర్కొన్న ఆయన వారు ఎంతో గౌరవంగా బతుకుతున్నారని వారిని బిచ్చగాళ్ళుగా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 


ఈ మధ్య అప్పన్న ప్రసాదాల ధరలు పెంచారని విన్నానని కానీ దేవాలయాల విషయంలో వ్యాపార దృక్పథంతో ఆలోచించకూడదు అనేది తన అభిప్రాయం అని అన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుంటే ఇలాంటి పనులు చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిరోధించడం లేదని ఆయన ప్రశ్నించారు. అందరికీ మాన్సాస్ భూములే కావాలని ఆయన ఆరోపించారు. ఇక దేవాలయాలకు ఇచ్చే 17 శాతం డబ్బు మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కాదని అది భక్తుల సొమ్ము అని అన్నారు. ఇదేమైనా చిల్లర కొట్టు అనుకుంటున్నారా అని ప్రశ్నించిన ఆయన భక్తులు వేస్తున్న కానుకల సొమ్ము పథకాలకు వాడుతున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: