తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి  షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఏడున్నర సంవత్సరాల నుంచి  ఎదురులేని శక్తిగా టిఆర్ఎస్  పాలన చేస్తోంది. ఆ పార్టీలోకి ఏ నేతలైన రావడమే తప్ప, టిఆర్ఎస్ నుండి వెళ్లిపోవడం ఇప్పటివరకు లేదు. కానీ ఈమధ్య టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ముసలం రేగింది. ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నారు. గత ఏడున్నర సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సరైన రథసారధి, ప్రణాళిక ప్రకారం వెళ్ళే నేత లేఖ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు బయట పార్టీలకు వెళ్లిపోయారు.

ముఖ్యంగా సగం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి టిఆర్ఎస్, బిజెపిలో  చేరాలని చెప్పవచ్చు. అలా వెళ్లిన వారికి ఆ పార్టీలో ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో అప్పటి నుంచి వారు సైలెంట్ గానే  ఉన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీకి టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం కనబడుతోంది. రేవంతు తమదైన శైలిలో పాత నేతలందరినీ కలుస్తూ, ఆహ్వానం పలుకుతున్నాడు. దీంతో ఇతర పార్టీల్లో ఉన్న పాత కాంగ్రెస్ నేతలు, అసమ్మతి నేతలు కాంగ్రెస్ లోకి రావాలని ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ సామ వెంకట్ రెడ్డి సహా  మండలి కార్యవర్గ సభ్యులు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ లో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కానీ, ఇప్పటివరకు చేయలేదని ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని పార్టీలో ఉద్యమకారులకు విలువ లేదని సామ వెంకట్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను పార్టీలోకి ఆహ్వానించి, ఉద్యమంలో పనిచేసిన నేతలకు  గుర్తింపు ఇవ్వలేదని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: