క‌రోనా క‌ట్ట‌డికి, లాక్‌డౌన్‌లో ప్ర‌భుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప‌లు రాష్ట్రాలు గ‌తంలోనే అల్కాహాల్‌ను ఆన్‌లైన్ ద్వారా హోం డెలివ‌రిని ప్రారంభించాయి. ఇదే దారిలో తాజాగా మ‌రో రాష్ట్రం కూడా న‌డ‌స్తోంది. అసోంలో మ‌ద్యం ఆన్లైన్ అమ్మకాలకు తెరతీసింది అక్కడి బీజేపీ ప్ర‌భుత్వం. తొలి విడతలో రాష్ట్రంలోని ప్రధాన నగరమైన గువహటిలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. త‌రువాత క్ర‌మంలో ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనుంది.

   అసోం అబ్కారీ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్ర‌భుత్వం వివరించింది. లిక్క‌ర్‌ దుకాణాల ముందు భారీగా జనం గుమిగూడుతున్నారని ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. విదేశీ మద్యం, బీర్లు, నాటు సారా తదితర ఉత్పత్తులను ఆన్లైన్ లో విక్రయించనున్నట్లు వివరించింది.


ఈ హోం డెలివ‌రి  ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంద‌ని వివ‌రించారు. అర్హులైన వినియోగదారులు మూడు లీటర్ల వరకు మద్యాన్ని ఆర్డర్ చేయవచ్చ‌ని అధికారులు తెలిపారు. డెలివరీ ఏజెంట్లు ఒకేసారి 9 లీటర్లకు మించి మద్యాన్ని తమ వెంట ఉంచుకునే వీలు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని  వివ‌రించింది. కానీ హాస్టళ్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా ప్రదేశాలకు మ‌ద్యం డెలివరీ ఉండదు. ఇప్ప‌టికే దిల్లీ, బంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే లిక్క‌ర్‌ హోం డెలివరీని మొద‌లు పెట్టాయి.


   గ‌తంలో క‌రోనా కట్టడిలో భాగంగా మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ను హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. అక్క‌డ‌ ఒక్కో వ్యక్తికి 12 బాటిళ్లు కొనుక్కునేందుకు అనుమతి ఇచ్చింది. క‌రోనా కార‌ణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ చిల్లు ప‌డింది. ఈ నేప‌థ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు, ప్ర‌భుత్వ రాబ‌డి పెంచుకునేందుకు ఈ చ‌ర్య‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్నాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌ద్యాన్ని ప్ర‌త్య‌క్షంగా కాకుండా ఆన్ లైన్‌లో విక్ర‌యించాలని సుప్రీం కోర్టు రాష్ట్రాల‌కు సుప్రీం కోర్టు సూచించింది. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ మ‌ద్యం అమ్మ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు మొగ్గు చూపుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: