నేటి రోజుల్లో కనిపించే కలియుగదైవం ఎవరు అంటే అందరూ గుక్క తిప్పుకోకుండా చెబుతారు తెల్ల బట్టలు ధరించే డాక్టర్లు అని. ఎందుకంటే కరోనా వైరస్ కష్టకాలంలో డాక్టర్లే ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు   ప్రస్తుతం సొంత వాళ్లే ప్రాణభయంతో ఇంటిపట్టునే ఉండి అందరిని రోడ్డుపాలు చేస్తూ ఉంటే.. ఏకంగా కుటుంబాలను సైతం వదిలేసి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్ కష్టకాలంలో వైద్యులు చేసిన త్యాగానికి మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేం అని అనడంలో  అతిశయోక్తి లేదు.  కరోనా వైరస్ కష్ట కాలంలో ఎంతోమంది కరోనా వైరస్ రోగులకు  పునర్జన్మ ఇచ్చారు ఎంతోమంది వైద్యులు.



 ఇలా కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఎంతో మంది వైద్యులు సైతం వైరస్ బారిన పడి చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కేవలం కరోనా వైరస్ బారిన పడినవారికి కాదు.. ఇక వివిధ రకాల వ్యాధులతో లేదా సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వచ్చిన వారికి కూడా ఎంతో మంది వైద్యులు  ప్రాణాలు నిలబెట్టి కలియుగ దైవం గా మారిపోయారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల చిన్నారి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడింది. దీంతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ప్రాణం ఎక్కడ పోతుందో అని ఆ తల్లి గుండె శోకసంద్రంలో మునిగిపోయింది.  దీంతో ఆ తల్లికి  ఏం చేయాలో తెలియలేదు. చివరికి డాక్టర్లను బ్రతిమిలాడుతూ ఏడుస్తూ ఉంది.



 దీంతో అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది ఏకంగా మూడు రోజుల బాబును  ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది  సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాబు పుట్టాడు  ఇక అనారోగ్యం వల్ల ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇక వరంగల్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆంబులెన్స్ లో వెళ్తుండగా ఆ చిన్నారి గుండె ఆగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ ద్వారా మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ చిన్నారి.

మరింత సమాచారం తెలుసుకోండి: