ఈ రోజున అంతర్జాతీయ పులుల దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని...  అట్టహాసంగా జరుపుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. మన ఇండియా ఒక్క జాతీయ జంతువు పులి. కానీ మనదేశంలో ఈ పులుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే... మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య చాలా తగ్గినట్లే కనిపిస్తుంది. అయితే ఈ పులుల సంఖ్య తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పులి మరియు మానవుని మధ్య ఘర్షణ ఒక కారణం. 

పులి అడవి నుంచి అలా జనసంద్రం లోకి రావడంతో.... మానవులు భయాందోళనకు గురై వాటిని హత మారుస్తున్నారు. పులుల సంఖ్య తగ్గిపోవడానికి ఇది ముఖ్యమైన కారణమని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిజల్ట్ నివేదిక ప్రకారం 2014 నుంచి 2018 సంవత్సరం వరకు మన దేశంలో పులుల సంఖ్య ఏకంగా 33 శాతం మేర పెరిగిందని తెలిపింది. 2014 సంవత్సరంలో 2226 పులులు ఉంటే... ఆ సంఖ్య కాస్త 2018 సంవత్సరం వరకూ 2967 కు చేరిందని ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిజల్ట్ వెల్లడించింది.

ఇండియా వ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక"అఖిలభారత పులుల సంఖ్య అంచనా 2018 "ను మన దేశ ప్రధాని మోడీ 2019 సంవత్సరంలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రాల వారీగా పులుల సంఖ్య ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 556 పులులు, కర్ణాటక రాష్ట్రంలో 524 పులులు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 442 పులులు, మహారాష్ట్ర రాష్ట్రంలో 312 పులులు మరియు తమిళనాడు రాష్ట్రంలో 264 పులులు ఉన్నాయి. అలాగే అస్సాం రాష్ట్రంలో 190, కేరళలో 190, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 173, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 88, రాజస్థాన్ లో  69 పులులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: