భారత్ లో కొత్తగా 44వేల 230మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటి కంటే 721కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కరోనాతో నిన్న 555మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 15లక్షల 72వేల 344కు చేరింది. ఇప్పటి వరకు 4లక్షల 23వేల 217మంది కరోనాతో మరణించారు. కొత్తగా 42వేల 360మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 3కోట్ల 7లక్షల 972కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 5వేల 155యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కనీస జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరిస్తోంది. లేకపోతే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే అంటోంది.

ఇక దేశవ్యాప్తంగా ఈ నెల 23నాటికి 70డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఏపీలో 2, తెలంగాణలో 2కేసుల చొప్పున నమోదయ్యింది. ఇక 46వేల శాంపిల్స్ పరీక్షించగా అందులో అత్యధికంగా 17వేల డెల్టా వేరియంట్ కేసులు ఉన్నాయంది. 4వేల ఆల్ఫా, 217బీటా, 1గామా వేరియంట్ కేసులు ఉన్నాయంది.

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్ట్ 14వరకు కర్ఫ్యూను పొడిగించగా.. రాత్రి 10నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ లో గత 24గంటల్లో 80వేల 641కరోనా టెస్టులు చేయగా 2వేల 68 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 22మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 19లక్షల 64వేల 117కు చేరగా ఇప్పటి వరకు 13వేల 354మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 2వేల 127మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21వేల 198గా ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: