ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కేసీఆర్ పై ఇంకా హరీష్ రావుపై భగ్గుమన్నారు.డ్రామాలకు పర్యాయ పదం కేసీఆర్ కుటుంబమని విమర్శించారు.అలాగే సినీ నటులు కంటే కూడా కేసీఆర్, హరీష్ రావులు గొప్ప నటులని రఘునందనరావు అన్నారు.ఇంకా అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హహురాలు కాదా? అని ప్రశ్నించారు.అలాగే ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించినట్లున్నారని రఘునందన్ రావు తెలిపారు.అలాగే వారు మానవత్వం పూర్తిగా మరచిపోయి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లునని అన్నారు. అంతేగాక ఈటల కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తాం అని అన్నారు.అంతేగాక హరీష్ రావు డ్రామాలకు శ్రీకాంతాచారి బలైయ్యాడని రఘునందన్ రావు అన్నారు.ఇక అంతేగాక పెట్రోల్ కొనుకున్న హరీష్ రావు 50 పైసల అగ్గిపెట్టెను మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? అని రఘునందన్ రావు విరుచుకుపడటం జరిగింది.

అంతేగాక హరీష్ రావుది డ్రామా అని తెలియకనే శ్రీకాంతాచారి ప్రెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడని రఘునందన్ రావు తెలిపాడు.అలాగే నిరాహారదీక్ష ముసుగులో కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా? అని కోపంతో రఘునందన్ రావు ప్రశ్నించారు.అలాగే వేరే పార్టీలో ఉంటే కష్టమని ఖమ్మంలో జ్యాస్ ఇచ్చిన డాక్టర్ కు గులాబీ కండువా కప్పలేదా? అని కూడా ప్రశ్నించడం జరిగింది.ఇక 2008 వ సంవత్సరంలో రాజశేఖరరెడ్డిని కలసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైన హరీష్ రావుతో చెప్పించే స్థితిలో మేము లేము అని రఘునందన్ రావు తెలిపారు.అలాగే పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్ లో చోటు కల్పించాలని కూడా రఘునందన్ రావు తెలిపారు.ఇక రేవంత్ రెడ్డికి పీసీసీ అనేది కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్తోందని ఆయన అన్నారు.ఇక అంతేగాక పార్లమెంట్ సమావేశాలు అనేవి కిషన్ రెడ్డి యాత్ర కారణంగానే బండి‌ సంజయ్ పాదయాత్ర వాయిదా పడిందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: