రాజ‌కీయాల‌ను శాసించిన వారంతా సైలెంట్ అయిపోతున్నారు. ఉత్త‌రాంధ్ర రాజకీయాల‌ను మేలి మ‌లుపు తిప్పిన వారంతా ఇళ్ల‌కే త్వ‌ర‌లో ప‌రిమితం కానున్నారు. కార‌ణాలు ఏమ‌యినా బొత్స లాంటి లీడ‌ర్లు కూడా రాజ‌కీయాల‌కు విముఖంగా ఉండ‌డం విశేషం.


ఇదే క్ర‌మంలో కొత్త త‌రం ఇంకా సిద్ధం కాక‌పోవ‌డం, పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయ నాయ‌క‌త్వాల కొర‌త అన్న‌ది ఈ ఎన్నిక‌ల స‌మ‌యం లో సుస్ప‌ష్టంగా ఉండ‌నుంది. ఈ త‌రుణాన పార్టీల మ‌నుగ‌డ‌కు కీల‌కంగా ఉండే సీనియ‌ర్లు ఇక‌పై పూర్తిగా ఈ ర‌ణ క్షేత్రం వ‌ద్ద‌నుకోవ డానికి కార‌ణంగా మారుతున్న ప‌రిణామాలు, విప‌రీతం అయిన ఒత్తిడి ఇవ‌న్నీ ఎందుకు అని వారు త‌మదైన ప్రాధాన్యం  త‌గ్గించు ని పూర్తిగా వీడ్కోలు తీసుకుని తీరాల‌ని నిశ్చ‌యించుకున్నారు. వ్య‌క్తులు ఎలాంటివారైన పార్టీల‌ను ప్ర‌భావితం చేసిన తీరు, రాజ‌కీ యాల‌ను శాసించిన రీతి, ప్ర‌జ‌ల‌పై వారు ఉంచుకున్న న‌మ్మ‌కం ఇవ‌న్నీ ఒక‌నాడు ఎంతో బాగా ప‌నిచేసిన స‌మీక‌ర‌ణాలే. కానీ ఇప్పుడు ఆ గెలుపు సూత్రాలు ప‌నిచేస్తాయో లేదా అన్న‌ది వీరి సంశ‌యం. త‌మ‌కు క‌లిసొచ్చిన అంశాలు రాన్రూనూ దూరం అవుతుండ‌డ‌మే వీరి నిరాశ‌కు సంకేతం అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు.




రాష్ట్రం విడిపోతున్న‌ప్పుడు ముగ్గురు నేత‌లు కీల‌కంగా ఉన్నారు. వారంతా అప్పుడు కాంగ్రెస్ కు వీర విధేయులు. త‌రువాత వాళ్లంతా పార్టీ కోసమే తామిలా ప‌నిచేశామ‌ని చెప్పారు కూడా! అంత గొప్పగా పార్టీ ఉన్న‌తి కోరుకున్న ఆ ముగ్గురిలో ఒక‌రు బొత్స స‌త్య‌నారాయ‌ణ (ఇప్పుడు మున్సిప‌ల్ శాఖ నిర్వాహ‌కులు), రెండు శ‌త్రుచ‌ర్ల, మూడు వైరిచ‌ర్ల కిశోర్ చంద్ర‌దేవ్ (అప్ప‌టికి ఆయ‌న ఎంపీ) ఈ ముగ్గురిలో ఒక‌రు వైసీపీకి వెళ్లిపోయారు. ఒక‌రు బాబు గారి హ‌యాంలో టీడీపీకి వెళ్లిపోయారు. మంత్రి ప‌ద‌వి కూడా అందుకున్నారు. మూడో వ్య‌క్తి వైరిచ‌ర్ల (బాగా చ‌దువుకున్న‌వాడు మిగ‌తా ఇద్ద‌రితో పోలిస్తే సున్నిత మ‌న‌స్కుడు. కూతురు శ్రుతి ని ఇటు గా తీసుకువ‌చ్చారు కానీ ఆశించిన రీతిలో ఆమె రాణించ‌లేదు. ప్ర‌స్తుతం ఆమె టీడీపీలో నాన్న‌తో పాటే ప‌నిచేస్తు న్నారు. కిశోర్ చంద్ర‌దేవ్ మొన్న‌టి వేళ అర‌కు ఎంపీగా టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు.) ఇప్పుడు ఈ ముగ్గురు రాజ‌కీ యాల‌లో అనుకున్నంత స్థాయిలో రాణించ‌లేక‌పోతున్నారు. బొత్స గురించి చెప్పే క‌న్నా ముందు శ‌త్రుచ‌ర్ల గురించే మాట్లాడాలి. పార్వ‌తీపురం ఏజెన్సీ ఏరియాలో మంచి ప‌ట్టున్న లీడ‌ర్.



విజ‌య‌నగ‌రం రాజకీయాల‌ను బొత్స‌తో స‌మానంగా అర్థం చేసుకున్న నాయ‌కుడు. బొత్స‌తో స‌మానంగా ఎదిగిన‌వాడు. ఇప్పుడీ య‌న రాజ‌కీయాల నుంచి వైదొల‌గనున్నారు. విజ‌య‌న‌గ‌రంతో పాటు శ్రీ‌కాకుళం రాజ‌కీయాల‌పైనా శ‌త్రుచ‌ర్ల ప్ర‌భావం బాగానే ఉం ది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆయ‌న సైలెంట్ అయిపోతార‌ని అనుకున్నారు కానీ అనూహ్యంగా బాబు గారి క్యాబినెట్ లో బెర్తు కొట్టే శారు. ఇక  జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌భంజ‌నం మొద‌ల‌య్యాక త‌మ్ముడి కోడ‌లు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆమెనే పాముల పుష్ప శ్రీ వాణి. శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామరాజు, చంద్ర‌శేఖ‌ర్ రాజు ఇద్ద‌రూ టీడీపీలోనే ఉన్నారు. ఇదే స‌మయంలో వైరిచ‌ర్ల కిశోర్ చంద్ర‌దేవ్ కూ డా ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా లేరన్న విష‌యాన్నీ గుర్తించాలి. ఆయ‌న కూడా దాదాపు రాజ‌కీయ ర‌ణ క్షేత్రం నుంచి దూ రం అయ్యార‌నే అనుకోవాలి. ఒకనాడు ఢిల్లీ కేంద్రంగారాజ‌కీయాలు న‌డిపిన వైరిచ‌ర్ల ఏఐసీసీతో మంచి సంబంధ బాంధ‌వ్యాలు ఉన్న‌వా డు. చ‌దువుకున్న‌వాడు కావ‌డంతో మ‌రీ అయ్య‌న్నలానో, శ‌త్రుచ‌ర్ల‌లానో, బొత్స‌లానో నోరు పారేసుకునే వ్య‌క్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap