డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలు సమర్థవంతంగా ఆరోపణలు చేయలేకపోయారు అనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది. వ్యవహారంలో కీలక నాయకులు మాట్లాడకపోవటంతో కాంగ్రెస్ పార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ మధ్యనే యుద్ధం జరుగుతుంది అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమయింది. తెలంగాణలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో వచ్చిన మంచి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వాడుకోలేకపోయింది అనే అభిప్రాయం కొంతవరకు వినపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ధర్మపురి అరవింద్ గానీ పెద్దగా మాట్లాడలేదు.

అదేవిధంగా జితేందర్ రెడ్డి లాంటి నాయకులు కూడా దీనికి సంబంధించి ఘాటుగా విమర్శలు చేయలేకపోయారు. బీజేపీ ఎమ్మెల్యేలు గా ఉన్న రఘునందన్ రావు గాని అలాగే రాజాసింగ్ గాని అలాగే బీజేపీ కీలక నేతగా మారిన ఈటెల రాజేందర్ గానీ పెద్దగా దీనికి సంబంధించి ఆరోపణలు చేయకపోవడం సంచలనమైంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసే విమర్శలకు ప్రజలలో మంచి గుర్తింపు వచ్చింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి విమర్శలతో కాస్త సంతోషంగా ఫీల్ అయ్యారు.

కానీ బండి సంజయ్ ఏమీ మాట్లాడక పోవడం తో అలాగే ధర్మపురి అరవింద్ గాని ఇతర కీలక నాయకులు గానీ సరైన స్పందన ఇవ్వకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ పెద్దగా ఇబ్బంది పడలేదు. రాజకీయంగా ఈ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సరే దాన్ని సమర్థవంతంగా వాడుకోవడంలో విఫలం కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించి ఛాలెంజ్ విసిరిన తర్వాత బీజేపీ నాయకులు కూడా ఘాటుగా స్పందించిన ఉంటే మీడియాలో బాగా హైలెట్ అయి ఉండేది అనే అభిప్రాయం కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp