జనసేన పార్టీ ఏపీ సిఎం వైఎస్ జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడానికి సిద్దమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో సంచలన విమర్శలు చేయడం మనం చూసాము. ఇక ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన జనసేన నేత పోతిన వెంకట మహేష్... పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2020 దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి తమరు హామీ ఇచ్చినట్టుగా 70 కోట్ల నిధులను తక్షణమే అమ్మవారి ఆలయానికి మళ్ళించాలి అని ఆయన డిమాండ్ చేసారు.

ఇంతవరకు నిధులు రాలేదని ఈవో భ్రమరాంబ గారు లిఖితపూర్వకంగా తెలియజేశారు అని ఆయన ప్రస్తావించారు. దసరా ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తున్నారు అన్న ఆయన  2019 & 2020 దసరా ఉత్సవాలకు సంబంధించిన నిధులను కూడా తమరు మంజూరు చేయలేదు అని విమర్శించారు. 2021 దసరా ఉత్సవాలు నాటికి ఈ మూడు సంవత్సరాల దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదల చేయగలరు అని ఆయన లేఖలో కోరారు.  దుర్గగుడి అభివృద్ధి కోసం 70 కోట్ల ఖర్చుకు  ఒక నిజాయితీ గలిగిన ఐఏఎస్ అధికారిని  పర్యవేక్షణ కోసం నియమించండి అని ఆయన విజ్ఞప్తి చేసారు.

లేదంటే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి దండుపాళ్యం గ్యాంగ్ దోచుకునే ఆస్కారముంది అని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పై సామాన్య భక్తులకు ఉచిత దర్శనాలను పునరుద్ధరించాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. కేవలం డబ్బును వారిని అనుమతించడం వల్ల సామాన్యులను శ్రీ వారికి దూరం చేయొద్దు అని విన్నవించారు. కేవలం అరగంటలోనే 2 లక్షల 50 వేల టిక్కెట్లు ఆన్లైన్ స్లాట్ లో తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు ఆయన. సామాన్య భక్తులను దగా చేయొద్దు దళారులను ప్రోత్సహించ వద్దని మీకు నా  మనవి అని లేఖలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: