ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి. ఇప్ప‌టికిప్పుడు ఆర్టిక‌ల్ 356ను విధించాలి. ఇదీ.. టీడీపీ నేత‌ల డిమాం డ్‌. అయితే.. వీటిని నిజంగానే విధించే అవ‌కాశం ఉందా?  లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. ఆస‌క్తిక‌ర విష‌యం మాత్రం వైసీపీ నేత‌ల మధ్య తార‌ట్లాడుతోంది.  ఇన్ని చేసినా.. టీడీపీని ఎవ‌రూ న‌మ్మబోర‌ని అంటున్నారు. జ‌గ‌న్ దెబ్బ‌తో టీడీపీ బెంబేలెత్తుతున్న విష‌యం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింద‌ని.. అంటున్నారు. వాస్త‌వానికి.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న పార్టీగా టీడీపీ ఇలాంటి వాటికి వెరుస్తుంద‌ని.. తాము అనుకోలేద‌ని..ఎక్కువ మంది చెబుతున్నారు.

సాధారణంగా ఇలాంటివి జ‌రుగుతాయ‌ని.. గ‌తంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ ర‌త్న భ‌వ‌న్‌పైకి టీడీపీ నేత‌లు వెళ్లి దాడికి పాల్ప‌డి త‌గ‌ల‌బెట్టార‌ని.. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌రిచిపోయిన‌ట్టు ఉన్నార‌ని అంటున్నారు. నిజానికి ఇప్పుడు జ‌రిగిన ప‌రిణామంపై దీక్ష‌లు, నిర‌స‌న‌ల‌కు వెళ్ల‌డం వ‌ల్ల‌.. పైకి బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అంటున్నారు. టీడీపీ ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం గ్రామ స్థాయిలో జ‌రుగుతున్న‌ట్టు వైసీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది త‌మ‌కు క‌లిసి వ‌చ్చిన ప‌రిణామ‌మ‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి ఏ పార్టీకైనా పైకి ఎంత ప్రచారం ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం చాలా బ‌లం అవ‌స‌రం ఉంటుంద‌ని.. దీనిని టీడీపీ పోగొట్టుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అన‌వ‌స‌రంగా యాగీ చేయ‌డం ద్వారా.. చంద్ర‌బాబు త‌న బ‌లాన్ని తానే త‌గ్గించుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇక‌, కేంద్రంలోని.. పెద్ద‌ల‌కు చెప్పుకొన్నా.. ఇక్క‌డి ప‌రిణామాల‌పై వారు కూడా ఆరాతీస్తార‌ని.. గంజాయి సాగుకు సంబంధించిన రికార్డుల‌ను చూస్తే.. కేంద్రానికి ఏపీలో ఉన్న ప‌రిస్థితి అర్ధ‌మ‌వుతుంద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. అంటే.. ఇటు ఏపీలో చేసిన నిర‌స‌న‌ల‌తో టీడీపీకి మొత్తానికే వ్య‌తిరేత‌క రాగా.. ఇప్పుడు కేంద్రానికి చేసిన ఫిర్యాదుల వ‌ల్ల‌.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు.

జ‌గ‌న్‌పై విశాఖ‌ప‌ట్నం పోర్టులో కోడిక‌త్తి దాడి జ‌ర‌గింది. ఇది రాష్ట్రాన్ని కుదిపేసింది. అయినప్ప‌టికీ ఆద‌రా బాద‌రాగా.. జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి అక్క‌డి పెద్ద‌ల‌కు చెప్పుకోలేదు. మ‌రి ఇప్పుడు ఎంతో రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని.. త‌న‌ను మించిన వారు లేరని చెప్పుకొనే చంద్ర‌బాబు ఇలా చీటికీ మాటికీ.. ఢిల్లీ వెళ్లి పెద్ద‌ల‌ను క‌లిస్తే.. ఆయ‌న‌కే ప‌లుచ‌న క‌దా?! అంటున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ గ్రాఫ్ త‌గ్గిపోవ‌డ‌మే కాకుండా.. పార్టీ అధినేత పైనే న‌మ్మ‌కం స‌న్న‌గిల్ల‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేసేవ‌న్నీ.. ఉడ‌త ఊపులేనని.. వైసీపీ వ‌ర్గాల్లో కామెంట్లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: