కరోనా వ్యాప్తితో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అమెరికా ఆదేశాలు జారీ చేసింది. వీటిలోభారత్ కూడా ఉంది. ఈ నిర్ణయం నవంబర్ 8నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం నవంబర్ 8నుంచి అమల్లోకి రానుంది. వ్యాక్సినేషన్ రేటు 10శాతం కంటే తక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు కూడా ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వారు అమెరికాకు వచ్చిన 60రోజుల్లోపు టీకా పొందాల్సి ఉంటుంది. 72గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు సమర్పించాలి.

మరోవైపు భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ మరికొన్ని గంటల్లో డబ్ల్యూహెచ్ ఓ అనుమతి దగ్గనుంది. డబ్ల్యూహెచ్ ఓ సాంకేతిక కమిటీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి రివ్యూ ప్రారంభించింది. రాబోయే 24గంటల్లో కోవాగ్జిన్ వాడకానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి తెలిపారు. అయితే డబ్ల్యూహెచ్ ఓ ఆమోదం లభిస్తే కోవాగ్జిన్ వేసుకున్న వారు విదేశాల్లో ప్రయాణించేందుకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి.

మనదేశంలో కొవిషీల్డ్ రెగ్యులర్ మార్కెటింగ్ కు అనుమతి కోరుతూ డీసీజీఐ సీరం ఇనిస్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ తో పాటు ఇతర దేశాల్లో 100కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు సీరం సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ వ్యాక్సిన్ తయారీ కంపెనీతో సమావేశమైన కారణంగా డీసీజీఐ సీరం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కోవీషీల్డ్ కు ప్రస్తుతం భారత్ లో అత్యవసర అనుమతి మాత్రమే ఉంది.

మరోవైపు భారత్ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.  కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 356మంది మృతి చెందారు. ఇక గడిచిన 24గంటల్లో 15వేల 951 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్షా 63వేల 816కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 6వేల 664కేసులు కేరళలోనే వెలుగు చూశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: