ప్రపంచాన్ని మొత్తం కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయపెడుతోంది. అయితే రెండవ దశలో వెలుగులోకివచ్చి లక్షల మంది ప్రాణాలు తీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ 5 రెట్లు ప్రమాదకరమైనది అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అన్ని దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి.. తక్కువ కేసులు ఉన్న సమయంలోనే కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలను  అమలులోకి తీసుకు వస్తున్నాయి.


 ఇక కొన్ని దేశాల్లో అయితే మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు భారత్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే  ఓమిక్రాన్ కు సంబంధించి బెంగళూరులో కొత్తగా రెండు కేసులు వెలుగులోకి రావడం అందరిలో మరింత భయాన్ని పెంచింది. ఈ క్రమంలోనే ఇటీవలే తమిళనాడులోని మదురై నగరం ఆంక్షల కొరడా ఝుళిపించింది. టీకా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు అంటూ ఇటీవల నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు మదురై నగరం అధికారులు.



 మార్కెట్లు,షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ లతో పాటు 18 ప్రదేశాలకు కూడా టీకా వేసుకోని వారిని వెళ్లేందుకు అనుమతి లేదు అంటూ నిబంధన విధించింది. కనీసం ఒక్క డోస్ అయినా వేసుకొని ఉండాలి అంటూ సూచించింది. ఒక వారం పాటు సమయం ఇస్తున్నామని ఈ గడువులోగా టీకా తీసుకోవాలని అయినప్పటికీ తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్ సహా ఇతర వాణిజ్య ప్రదేశాల లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు అంటూ మధురై కలెక్టర్ అనిష్ శేఖర్ వెల్లడించారు. ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: