తెలుగు దేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వేస్తాను అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. చెప్పిన విధంగానే వారందరికి డబ్బులు వేశాడు. ఇకపోతే హిందూ కుటుంబలలో ఎక్కువ శాతం ప్రతి కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు. ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలు అత్యంత తక్కువగా ఉంటాయి. ఇక నలుగురు , ఐదుగురు పిల్లలు ఉన్న కుటుంబాల్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

 దానితో తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తాను అని చంద్రబాబు చెప్పడం , చెప్పిన విధంగా పాటించడంతో హిందూ కుటుంబాల కంటే కూడా ముస్లిం కుటుంబాలకే ఈ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. లెక్కలు కూడా ప్రస్తుతం దానికి అనుగుణం గానే బయటికి వచ్చాయి. ఇకపోతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై సి పి పార్టీ అధికారంలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. వై సి పి పార్టీ కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది.

ఇక అప్పటితో పోలిస్తే మైనార్టీలకు తెలుగు దేశం పార్టీ ద్వారా తల్లికి వందనం పథకం ద్వారా 54% అధికంగా లాభం జరుగుతుంది అని తెలుస్తుంది. వై సి పి హయాంలో 3.12 లక్షల మందికి 468 కోట్లు ఇస్తే , కూటమి ప్రభుత్వంలో 4.81 లక్షల మందికి 718 కోట్లు జమ చేసాము అని మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్ తాజాగా చెప్పుకొచ్చాడు. దీని ద్వారా తల్లికి వందనం పథకం ద్వారా హిందువుల కంటే కూడా ముస్లింలకు అధిక ప్రయోజనం జరిగింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: