
జగన్ సీఎంగా ఉన్నప్పుడు అంతకుముందు పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేసినప్పుడు కూడా ఆయన చేతికి కేవల వాచ్ తప్ప ఎలాంటివి ఉండేవి కావట.. కానీ తాజాగా జగన్ ధరించిన ఉంగరం కేవలం ఉంగరం కాదని జగన్ వ్యక్తిగత శైలిలో కూడా ఒక సాధారణమైన మార్పులు సూచించేలా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే జగన్ ధరించిన ఈ ఉంగరం ఆరోగ్యం లేదా శ్రేయస్సు కు సంబంధించినవి అయ్యి ఉండవచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ఒక స్టీల్ ఉంగరాన్ని ధరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే చంద్రబాబు ధరించినప్పుడు కూడా తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి అలాగే తాను యవ్వన శక్తిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారట. ఇప్పుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఉద్దేశంతోనే ఈ రింగును ధరించి ఉండవచ్చని కొంత మంది వెల్లడిస్తున్నారు. మొత్తానికి అటు ఒకవైపు జనాలలో మమేకమవుతూ పేరు సంపాదించుకుంటున్న జగన్ ఇప్పుడు ఈ రింగ్ వల్ల మరొకసారి పేరు వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీకి సంబంధించి అన్ని విషయాలకు కూడా కొంతమేరకు పాజిటివ్గానే వస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీకి జగన్ పేరు ఇబ్బందికరంగా మారుతున్నది.