పాలు.. ప్రతి రోజు ప్రతిఒక్కరికి కావాల్సిన పదార్థం. ఉదయం లేవగానే చిక్కటి పాలతో చక్కటి కాపీ తాగితే ఆ మజానే వేరు. ఇలా పాలతో ప్రతిఒక్కరికి అనుబంధం ఉంటుంది. ఒక్క కాపీ అనే కాదు చాలా పదార్ధాలు పాలతోనే తాయారు చేస్తారు. టీ, కాఫీ, స్వీట్స్, పెరుగు, ఇలా చాలా చేసుకుంటాం. మనిషికి పాలతో చాల అనుబంధం ఉంటుంది. పుట్టినప్పటి నుండి మనకు పాలతో అనుబంధం ఉంటుంది.


ఇంకా చెప్పాలంటే వైద్యుల సలహా మేరకు ఆరోగ్యం కోసం, పౌష్టికాహారం కోసం పాలను తీసుకోమని సలహా ఇస్తుంటారు. మనము కూడా అలానే చేస్తాము. కానీ ఇంకా వైద్యులు సలహా ఇచ్చిన, పక్క వారు సలహా ఇచ్చిన ఆలా చేసే అంత సీన్ మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు పాల విలువ దాదాపు 140 రూపాయిలు. ఒకప్పుడు పేద వారికీ మాత్రమే దొరికేవి కాదు, ఇప్పుడు మధ్య తరగతి వారికీ కూడా పాలు దొరికేలా లేవు. 


అయితే ఇది మన రాష్ట్రంలో కాదు లెండి, ఆలా అని మన దేశంలోనూ కాదు. పక్క దేశంలో పాలు 140 రూపాయిలు. పక్క దేశం అంటే నేపాల్, శ్రీలంక కాదు పాకిస్థాన్ లో పాల విలువ 140 రూపాయిలు. సాధారణంగా లీటర్ పాల ధర గరిష్ఠంగా రూ. 60కి మించదు కానీ పాకిస్థాన్ లోని కరాచి నగరంలో పాల ధర పెట్రోల్, డీజిల్ ధరలను మించిపోయి 140 రూపాయిలు అయ్యింది. 


మొహర్రం సందర్భంగా మంగళవారం నాడు పాక్‌లో లీటర్ పాల ధర 120 -140 రూపాయలు వరకు పలికింది. పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లింలు పాలతో వివిధ రకాలైన పానియాలు, వంటకాలు తయారు చేసి ప్రజలకు పంచుతారు. దీంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే పాక్ లో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు ఉండగా, డీజల్ ధర 91 రూపాయలు కానీ పాల ధర మాత్రం 140 రూపాయిలు అయ్యి అందరిని ఆశ్చర్య పరిచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: