
గత కొన్ని రోజులుగా టీం ఇండియా క్రికెటర్ KL రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళు ఇద్దరూ ఈ వార్తని ఖండించలేదు. అంతేకాకుండా ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు అంటే నమ్మండి. ఈ సమయంలో వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా చేసుకొని షేర్ చేయడం జరిగింది. ఇలా చేయడంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అర్థమైపోయింది.
ఇక శనివారం కేఎల్ రాహుల్ తన 28వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. రాహుల్ కు బీసీసీఐ, ఐసీసీ, స్టార్ క్రికెటర్లు అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తరుణంలోనే రాహుల్ గర్ల్ ఫ్రెండ్ అతియా కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ శుభాకాంక్షలులో హ్యాపీ బర్త్డే మై పర్సన్.. KL రాహుల్ అంటూ తెలియజేసింది. దీనితో వారి ఇద్దరి ప్రేమాయణం పై పూర్తి క్లారిటీ వచ్చేసింది.
ఇక ఇటీవల రాహుల్ పర్యటనలో వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ గా బాగా రాణించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా జరిగిన టీ - 20 లో 224 పరుగులు చేశాడు KL రాహుల్. ఇక మూడు వన్డే, టెస్టులో 205 పరుగులు చేయడం జరిగింది. ఇక IPL 2020 సీజన్ కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ గా KL రాహుల్ ఎంపిక కావడం జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ సీజన్ రద్దు చేయడం జరిగింది.