“ధోనీ కంటే నువ్వెందుకు గొప్పో, కోహ్లీ కంటే నువ్వెందుకు ఉన్నతమో చెప్తా...

క్రికెట్ అంటే చాలా దేశాల్లో ఒక ఎమోషన్...

కాబట్టి క్రికెటర్ అనే వాడు దూకుడుగా ఉండాలి, స్లెడ్జ్ చెయ్యాలి... అదే కెప్టెన్ అయితే, ఇక ప్రత్యర్ది భయపడేలా ఉండాలి...

కాని క్రికెట్ చరిత్ర చూడని మేలిమి బంగారం నువ్వు... క్రికెట్ పుణ్యం చేసుకుంటే నీ లాంటి ప్లేయర్‌ని క్రికెటర్‌గా చూస్తుంది...

2019 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నీ కెప్టెన్సీకి ప్రపంచమే ఫిదా...

దేశవాళీ ఆటలో చిన్న పొరపాటు చేస్తేనే కెప్టెనిజం ప్రదర్శించి, ముఖం చిట్లించుకుని, సాటి సహచరుడు అని కూడా చూడకుండా బండబూతులు తిట్టే నాయకులున్న క్రికెట్‌ ఇది...!

అలాంటిది, ప్రపంచ కప్పు ఫైనల్లో పట్టిన క్యాచ్‌ను నిలుపుకోకుండా, ఎదుటి జట్టుకు ఆరు పరుగులు ధారపోస్తే కూడా బౌల్ట్ పట్ల అంత ఉదారంగా ఎట్ల ఉండగలిగావు...!

అదే బౌల్ట్‌లో మరుక్షణంలో పుష్కలమైన ఆత్మవిశ్వాసం నింపావు. బౌల్ట్‌తోనే ఇన్నింగ్స్ చివరి ఓవర్, సూపర్ ఓవర్.. వరుసగా రెండు ఓవర్లను వేయించి,

లక్ష్యం ఛేదించకుండా ఇంగ్లండును నిలువరించేంత శక్తి నింపావు. కెప్టెన్ అంటే పెత్తందారీ కాదు, స్ఫూర్తినింపే ‘మెంటార్’ అని నిరూపించినందుకు నచ్చేశావు.

అదె కోహ్లీ అయితే కేకలు పెట్టేసి... హీరోలా ఫీల్ అయిపోయి తిడతాడు...

నువ్వు మా మ్యాచ్‌లు చూస్తావో లేదో... ఒక మ్యాచ్‌లో అంబటి రాయుడు ధోనీ క్రీజ్‌లో ఉన్నారు...

టార్గెట్ ఛేజింగ్‌లో మ్యాచ్ కష్టంగా ఉన్నప్పుడు... బంతులు తక్కువ పరుగులు ఎక్కువ ఉన్నప్పుడు... ధోనీ షాట్ కోసం ట్రై చేసాడు...

కాని సింగిల్‌ తీసే షాట్‌ కొట్టాడు... సింగిల్ తీసే ఛాన్స్ వస్తే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన రాయుడుకి బ్యాటింగ్ వస్తుంది... నమ్మకం లేక ధోనీ సింగిల్ తీయలేదు... అది డూ ఆర్ డై మ్యాచ్ కాదు

కాని నిన్న హైదరాబాద్‍కు డూ ఆర్ డై మ్యాచ్‌... ఆఖరి ఓవర్‌లో 9 కొట్టాలి...

మొదటి బాల్ షాట్ ట్రై చేసావ్ సింగిల్ వచ్చింది... హోల్డర్ బౌలింగ్ ఆల్‌రౌండర్... అతను అరుదుగా బ్యాటింగ్ చేస్తాడు...

కాని దమ్మున్నోడివి... సింగిల్ తీసి ఇచ్చేసావ్... ఆఫ్‌సైడ్ యార్కర్ వేస్తున్నాడు... గమనించావ్...

నువ్వు బ్యాటింగ్ చేయట్లేదుగా అని కోహ్లీ అనుకున్నాడు గాని నువ్వు క్రీజ్‌లో ఉన్నావ్ అనే విషయం మర్చిపోయాడు...

కెప్టెన్‌వి కదా... అలాగే ఆలోచించావ్... ఆఫ్‌ సైడ్ వచ్చి ఆడేసెయ్... అని సలహా ఇచ్చావ్‌... కోహ్లీ ఒత్తిడి ఫీల్ అయి డీప్‌లో ఫీల్డర్‌ను పెట్టలేదు...

నేను క్రికెట్ ఫ్యాన్... నీ గురించి ఒక్క ముక్కలో చెప్పనా...

క్రికెట్ మళ్ళీ నీలాంటి క్రికెటర్‌ని చూడలేదు... బంగారం నువ్వు... క్రికెట్ చూడని లెజెండ్ నువ్వు...”

మరింత సమాచారం తెలుసుకోండి: