ఒక సాదాసీదా వ్యక్తి ఒక గొప్ప క్రీడాకారుడు గా ఎదిగి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అంటే ఇక ఆ గొప్ప క్రీడాకారుడు వెనుక  కోచ్ ఎన్నో ఏళ్ల కనిపించని కష్టం ఉంటుంది అని చెప్పాలి. ప్రస్తుతం వివిధ క్రీడల్లో రాణిస్తున్న ఎంతో మంది క్రీడాకారులు ఒకప్పుడు ఇక గొప్ప కోచ్ సారథ్యంలోనే రాటుతేలిన వారే అని చెప్పాలి. ఇలా ఎంతో మంది ఆటగాళ్లు ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ తమను ఆ స్థాయికి రావడానికి చిన్నప్పటినుంచి ప్రోత్సహించిన కోచ్ లని  మాత్రం అస్సలు మరువరు. అయితే కోచ్ సరైనవాడు లేకపోతే ఆటగాడు కూడా సరైన ఆట నేర్చుకోలేడు. ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్ కావడం చాలా కష్టమే.



 ఇలా భారతీయ క్రికెట్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లను అందించి తన కోచింగ్ తో ఎంతో మంది యువకులను రాటుదేలేలా చేశాడు కోచ్ తారక్  సిన్హ. ప్రస్తుతం భారతీయ క్రికెట్ లో కొనసాగుతున్న ఎంతోమంది స్టార్ క్రికెటర్ ఈయనకు కోచింగ్ లో క్రికెట్ లో మెళుకువలు నేర్చుకున్నారు అని చెప్పాలి. చిన్నప్పటినుంచి క్రికెట్లోకి అడుగుపెట్టిన ఎన్నో మెళుకువలను నేర్పించి అంతర్జాతీయ క్రికెట్కు బహుమతిగా ఇచ్చాడు. ఈ కోచ్. ఇకప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లాంటి క్రికెటర్లు ఎంత క్రేజ్  సంపాదించారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆశిష్ నెహ్రా కూడా టీమిండియాకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు.



 టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న ఈ అందరూ ఆటగాళ్లను క్రికెటర్ గా మార్చింది మాత్రం  వారి చిన్ననాటి కోచ్ తారక్ అఖిల భారత క్రికెట్ను ఎంతోమంది క్రికెటర్లను అందించిన తారక్ సిన్హా ఇటీవలే అనారోగ్యం బారిన పడి మరణించారు. గత కొంత కాలం నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇటీవలే కొన్ని నిమిషాల ముందే కన్నుమూశారు. ఢిల్లీ నుంచి ఎంతో మంది క్రికెటర్లను అంతర్జాతీయ జాతీయ క్రీడగా తీర్చిదిద్దారు ఈయన మృతితో ఢిల్లీ క్రికెట్ బోర్డు మొత్తం విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: