ఇటీవలే టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన చేసి అందులోని నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి పోయింది. ఇక ఆ తర్వాత పుంజుకుని మూడు మ్యాచ్లలో విజయం సాధించినప్పటికీ చివరికి సెమీస్ అవకాశాలను మాత్రం కోల్పోయింది. దీంతోఫైనల్లో అడుగుపెట్టకుండా అనే ఇంటి బాట పట్టింది టీమిండియా. అయితే మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ జట్టుతో టి20 టెస్ట్ సిరీస్ లో ఆడుతుంది టీమ్ ఇండియా. ఇక మొదటి సారి కొత్త కెప్టెన్ తో టీమిండియా బరిలోకి దిగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలి వరల్డ్ కప్ ముగిసిన తర్వాత  కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు కోహ్లీ.


 ఈ క్రమంలోనే టీం ఇండియా జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ ను నియమిస్తూ ఇటీవలే బీసీసీఐ న్యూజిలాండ్తో తలపడపోయే టీమిండియా జట్టును కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక వైస్ కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఇక టీమిండియాకు వైస్ కెప్టెన్ గా అవకాశం రావడం పై కె.ఎల్.రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి పనిచేసేందుకు తాను ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్ కు తాను టీమిండియాకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని ఎంతో బాధ్యతగా భావిస్తున్నానని తెలిపాడు కేఎల్ రాహుల్.



 ఒక వైస్ కెప్టెన్గా తనపై చాలా బాధ్యత ఉంటుంది అంటూ తెలిపాడు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లంతా కలివిడిగా ఉండేలా చూడటం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జట్టుకు వైస్ కెప్టెన్గా ఆటగాళ్లకు ఇలాంటి వాతావరణం కల్పించే వరకూ తాను ఎప్పుడూ ప్రయత్నిస్తాను అని తెలిపారు. ఇటీవలే టీమిండియాకు కోచ్గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ ఎంత గొప్ప క్రికెటరో అందరికీ తెలుసు.. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తాను. నేను కర్ణాటక జట్టు తరఫున ఆడుతున్న అప్పటినుంచి రాహుల్ ద్రావిడ్ ను అనుకరించేందుకు ప్రయత్నించే వాడిని.. అయన టీమిండియాకు ఎంతో మంది యువ క్రికెటర్లను అందించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: