సాధారణంగా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ పై అంచనాలు ఒక రేంజ్ లోనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత ఏ జట్టు ఎలా ప్రదర్శన చేస్తుంది అన్న దానిపై క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి క్లారిటీ  లేకుండా పోయింది  ఎందుకంటే ఐపీఎల్లో మెగా వేలం నిర్వహిస్తుండడంతో ఎవరు ఏ జట్టు లోకి వెళ్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో ఈ సారి ఐపీఎల్ పోరు ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఒక రేంజిలో అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి. అయితే 2022 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మెగా వేలం కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూడా తెలుస్తుంది.మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కాబోతోంది. అదే సమయంలో ప్రతి జట్టు కూడా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది బి సిసిఐ. దీంతో ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోబోతుంది ఎవరిని వదిలిపెట్టబోతుంది  అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించి  ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ సి బి జట్టులో కోహ్లీ తో పాటు ఎబి డివిలియర్స్  కీలక ఆటగాళ్లు గా ఉన్నారు. ఇటీవల ఎబి డివిలియర్స్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కోహ్లితో పాటు  జట్టు రిటైన్ చేసుకోబోయే ముగ్గులు ఆటగాళ్లు ఎవరు అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.అయితే గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఆల్రౌండర్ మాక్స్ వెల్  అద్భుతంగా రాణించాడు. మంచి ఫామ్ కనబరిచి  జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించాడు. దీంతో ఇక ఈ స్టార్ ఆల్రౌండర్ ను ఈసారి ఆర్ సి బి  జట్టు రిటైన్ చేసుకుంటుంది అని  అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ను రిటైన్ చేసుకునే అవకాశం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ప్పటికీ ఐపీఎల్ మొదలయ్యే సమయానికి ఇదే ఫామ్ కొనసాగిస్తాడా లేదా అన్న దానిపై మాత్రం అందరిలోనూ అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దీంతో ఇదే జరిగితే ఈ స్టార్ ఆల్రౌండర్ మెగా వేలంలో ఎవరు  సొంతం చేసుకుంటారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb