ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎవరూ ఊహించిన విధంగా సెమీఫైనల్ అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఇక సెమి ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి  ఫైనల్ కు చేరింది. ఈ క్రమంలోనే 1992 లాగానే అన్నిరకాల ఫలితాలు వస్తున్న నేపథంలో ఇక 1992 వరల్డ్ కప్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మరోసారి విశ్వ విజేతగా నిలవడం ఖాయమని ఎంతో బలంగా నమ్మారు పాకిస్తాన్ అభిమానులు. కానీ ఊహించని రీతిలో ఇటీవల మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది.



 ఇక మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తక్కువ పరుగులకే పరిమితం అయింది అని చెప్పాలి. 137 పరుగులు మాత్రమే చేసి ఇక ఇంగ్లాండ్ ముందు ఒక స్వల్ప స్కోర్ మాత్రమే టార్గెట్గా పెట్టింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లు ఇక ఆ టార్గెట్ ను కాపాడుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ల దూకుడు ముందు మాత్రం పాకిస్తాన్ నిలవలేకపోయింది అని చెప్పాలి. తద్వారా ఇక ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే ఫైనల్ లో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతి దాకా వచ్చిన మ్యాచ్ ను చేజార్చుకున్నాం అంటూ కెప్టెన్ బాబర్ అజాంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.



 ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంని ఉద్దేశిస్తూ ఆ జట్టు మాజీ ఫేసర్ మహమ్మద్ అమీర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ పిరికిపంద అయినప్పుడు ఫలితం కూడా ఇలాగే ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ పిరికిపంద చర్యల కారణంగానే పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది అంటూ అభిప్రాయపడ్డాడు. మైదానంలో  కెప్టెన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆటగాళ్లలో కూడా ధైర్యం ఉంటుంది. కానీ ఇటీవలే ఫైనల్ మ్యాచ్లో బాబర్ భయపడుతూనే కెప్టెన్సీ చేశాడు. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఫైనల్ మ్యాచ్లో మహమ్మద్ నవాజ్ కి బౌలింగ్ ఇవ్వడానికి తప్పుపట్టాడు మహమ్మద్ అమీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: