
ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ముగించుకుంది టీం ఇండియా. డిసెంబర్ 14వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ కు షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా రిషబ్ పంతునూ వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. కానీ ఇప్పుడు మాత్రం బీసీసీఐ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి పేలవమైన ఫాంతో కొనసాగుతున్న రిషబ్ పంత్ కు ఊహించని భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.
అయితే ఇలా రిషబ్ పంత్ నుంచి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను చటేశ్వర్ పూజారాకు అప్పగించిన నేపథ్యంలో ఇక రిషబ్ కు అసలు జట్టులో స్థానం ఉంటుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అదే సమయంలో ఇక రిషబ్ పంతునూ జట్టు నుంచి తప్పించి ఇక వికెట్ కీపర్ గా అతని స్థానంలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ నూ ఎంపిక చేయాలని బీసీసీఐ బావుస్తుందట. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఇక రిషబ్ పంత్ కు ఇంకా చాలా రోజుల వరకు కూడా జట్టులోకి మళ్ళీ తిరిగి రావడం కష్టతరం అవుతుంది అని చెప్పాలి. ఒకవేళ వన్డే ఫార్మట్ లో లాగానే అటు టెస్టుల్లో కూడా ఇషాన్ అదరగొట్టాడు అంటే ఇక పంతు స్థానం గల్లంతయినట్లే అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.