మహాభారతంలో ఒక్కో పాత్రకూ ఒక్కో విశిష్టత ఉంటుంది. ఇక కుంతీ తొలిపుత్రుడైన కర్ణుడి పాత్రలో అనేక కోణాలు ఉన్నాయి. అందరికంటే పెద్దవాడిగా పుట్టి.. అర్జునుడి కంటే విలు విద్యలో ఎంతో నేర్పరి అయినప్పటికీ.. రాజ్యాన్ని ఏలే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పట్టం కట్టలేకపోయింది వారి వంశం..

 

 

యుద్ధంలో కర్ణుడిని అర్జునుడు సంహరించానని నా చేతుల్లో మరణించాడని గొప్పకు పోతుండగా కృష్ణుడు ఒక్క మాట చెప్పాడు .. చచ్చిన పామును నేను చంపాను నేను చంపాను అన్నట్టు ఉంది నీ మాటలు అప్పటికే నలుగురు, అయిదుగురు హత్య చేసినవాడిపై నువ్వు చంపేసాను అనడం బావున్నదా .. అన్నాడు కృష్ణుడు.

 

 

నా మాయవల్లే అతను ఓడిపోయాడు.. ఇంద్రుడిని పంపి తన కవచకుండలాలను బిక్షమడిగి తెప్పించేసాను .. నీ తల్లి కుంతీదేవి మీ అందరి ప్రాణాలు భిక్షగా అడిగి నీ పై నాగాస్త్రం ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలని ప్రమాణం చేపించుకుంది.. ఇంకా గురువు శాపం భూమాత శాపం ఋషి శాపం అని ఇలా ఎన్నో అతనిని వెంటగా అతడు నాగాస్త్రాన్ని నీపై ప్రయోగించినప్పుడు రథచక్రాలు నా కాళ్లతో నొక్కి కిందకు పంపగా తప్పిపోయినది నీకు తగలకుండా.. ఇవన్నీ ఏమీ జరగకుండా ఉండి ఉంటె నువ్వు అతనిని చంపడం సాధ్యమేనా.. నువ్వు చంపగలవా అని అడగడంతో సిగ్గుతో తలదించుకున్నాడు అర్జునుడు ..

 

 

కర్ణుడికి సొంతమైన వారిని నా వాళ్ళు అనిచెప్పుకునే స్వేచ్ఛలేదు.. తన విలువిద్యను ప్రదర్శించే స్వేచ్ఛ లేదు.. ఎవరికోసమో తన జీవితాన్నే త్యాగం చేస్తూ బతికిన వ్యక్తి అందరి హృదయాలను గెలిచినవ్యక్తి ఆ కర్ణుడు.. నిజానికి దుర్యోధనుడు అతడిని స్నేహితుడుగా అంగీకరించకుండా ఉండి ఉంటె ఎవరికీ కర్ణుడనేవాడు అంతటి గొప్పవాడనికాని అతనంటూ ఓ వ్యక్తి ఉండేవాడని కానీ బహుశా ఎవరికీ తెలియకపోయుండొచ్చేమో .

 

మరింత సమాచారం తెలుసుకోండి: