అక్టోబర్‌లో వచ్చే ప్రత్యేక దినాలలో తదుపరి పెద్ద పండుగ కార్వా చౌత్. కార్వా చౌత్ అనేది ఉపవాసం పాటించే ఆచార దినం, ప్రధానంగా వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం జరుపుకుంటారు. మహిళలు అతని కుటుంబం ఈరోజు చంద్రుడు, శివుడు,వినాయకుడిని ఆరాధిస్తారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం అశ్విని నెలలోని కృష్ణ పక్ష చతుర్థి నాడు కార్వా చౌత్ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ సంవత్సరం 24 అక్టోబర్ 2021, ఆదివారం నాడు కార్వా చౌత్ వచ్చింది. ఈ ఉపవాసం చాలా పవిత్రమైనది. నీరు కూడా తాగకుండా రోజంతా ఖచ్చితంగా పాటించాలి. కార్వా చౌత్ సమయంలో చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో తెలుసుకోండి.కార్వా చౌత్ రోజు ఉపవాసాన్ని పాటించడం, అలాగే ఇవన్నీ చేయడం వల్ల భర్త, కుటుంబం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి పూర్తి గా భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో ఈ ఉపవాసాన్ని ఆచరించాలి.

కార్వా చౌత్ 2021: తేదీ, సమయం
కార్వా చౌత్ పూజ ముహూర్తం : సాయంత్రం 05:43 - 06:58 గంటలు
కార్వా చౌత్ ఉపవాస సమయం ఉదయం 06:13 గంటల నుంచి సాయంత్రం 08:16 గంటల వరకు

కార్వా చౌత్ రోజు చేయవలసిన పనులు
సూర్యోదయం నుండి ఉపవాసం ప్రారంభించాలి.
ఉదయాన్నే రెడీ అయ్యి,  పెద్దల పాదాల ను తాకి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి.
సూర్యోదయానికి ముందు తినాలి, ఇందులో అత్త గారు ఇచ్చే ఆహరం ఉండాలి.
ఎరుపు, నారింజ, పసుపు ను శుభప్రదంగా భావిస్తారు. మహిళలు ఈ రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
చంద్రుడిని చూసిన తరువాత, అర్ఘ్య సమర్పణ చేసి ఉపవాసం ముగించాలి.

ఏమి చేయకూడదు?
పూజకు నలుపు, తెలుపు రంగు వాడొద్దు. కాబట్టి మహిళలు ఈ రంగుల దుస్తులు ధరించకూడదు.
మహిళలు పగటి పూట నిద్రించకూడదు.
ఈ రోజున కత్తెర, సూది వంటి వాటిని ఉపయోగించొద్దు.
మహిళ లు ఎవరినీ నొప్పించకూడదు, నాలుకపై నియంత్రణ కోల్పోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: