హిందువుల ఆకాంక్ష అయినటువంటి  అయోధ్య రామ మందిర నిర్మాణం ఇప్పటికే పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ దేవాలయాన్ని చూసి రాముల వారిని దర్శించుకోవడానికి కోట్లాదిమంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇదే తరుణంలో అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు నెలకొల్ప బడింది.. మరి ఇంతకీ అయోధ్య రామ మందిరం సాధించిన రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరం లో  రామ మందిరం ప్రారంభోత్సవం అయింది. ఈ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కూడా చేశారు.

 దేశం లోనే అత్యంత అద్భుతమైన పర్యాటక కేంద్రంగా  విరాజిల్లుతున్న అయోధ్య రామ మందిరం  తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.. ఈ అయోధ్య రామ నిర్మాణం చేపట్టి 17 నెలలు అయిన సందర్భంగా 55 కోట్ల 50 లక్షల మంది భక్తులు ఇప్పటికే ఈ రామ మందిరాన్ని దర్శించుకున్నారట. ఇందులో అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వెళుతున్న వారిలో ఎక్కువ శాతం మంది  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,  ఉత్తరాఖండ్ ప్రజలు ఉన్నారట.

ఇప్పటికే దేశం లోని 40% ప్రజలు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడం ఒక రికార్డుగా నిలిచింది. అంతేకాదు ఈ అయోధ్య రామ మందిరం త్వరలోనే భారతదేశంలోని టూరిస్ట్ స్పాట్ లో మొదటి స్థానంలో నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇప్పటివరకు భారత్ లో టాప్ టూరిస్ట్ స్పాట్ గా ఢిల్లీ ఆగ్రా లో ఉన్న తాజ్ మహల్ ఉండగా దాన్ని దాటేసే దిశగా అయోధ్య రామ మందిరం ముందుకు వెళ్తోంది.. ఏది ఏమైనప్పటికీ హిందువులు 500 ఏళ్ల నుంచి కోరుకుంటున్న అయోధ్య రామ మందిర నిర్మాణం  పూర్తవ్వడం ఆ మందిరాన్ని ఎంతోమంది హిందువులు దర్శించుకోవడం నిజంగా ఆనందదాయకం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: