మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2009 వ సంవత్సరం జూలై 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 16 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 22.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 13 కోట్లు , ఉత్తరాంధ్రలో 5.90 కోట్లు , ఈస్ట్ లో 4.32 కోట్లు , వెస్ట్ లో 4.13 కోట్లు , గుంటూరులో 5.8 కోట్లు , కృష్ణ లో 3.63 కోట్లు , నెల్లూరులో 3.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 61.66 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 8.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 3.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ తెలుగు వర్షన్ కు 73.46 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ తమిళ్ మరియు మలయాళ వర్షన్లకి 4.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి అన్ని వెర్షన్లలో కలిపి 77.96 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు 40.42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 77.96 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 37.504 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rc