ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న భారత జట్టు కు మొదటి వన్డే సిరీస్ లో నే  భారీ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు వన్డే మ్యాచ్ల లో ఓడి పోవడం తో వన్డే సిరీస్ చేజార్చుకుంది టీమిండియా. కనీసం ఆస్ట్రేలియా జట్టు కు సరైన పోటీ కూడా ఇవ్వలేక పోయింది. రెండు మ్యాచ్ లలో కూడా ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై వరుస గా రెండు వన్డేల్లో ఓడి  పరాజయాన్ని చవిచూసి... సిరీస్ చేజార్చుకున్న భారత్ బుధవారం... ఆస్ట్రేలియా తో నామ మాత్రపు వన్డేలో తలపడనుంది.



 అయితే  రెండు మ్యాచ్లలో బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ని  తక్కువ పరుగుల కే కట్టడి చేయడం లో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ టాపార్డర్ కూడా సరైన పరుగులు చేయలేక విఫలం అయ్యి అభిమానులను నిరాశ పరిచారు. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం సిరీస్ చేజారిపోయింది. కానీ రాబోయే సిరీస్ లలో  మాత్రం ఇండియా తప్పిదాన్ని దిద్దుకోవాలి అంటూ మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.



 ఈ క్రమంలోనే స్పందించిన భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా టీమిండియా సమస్య ఏంటి అనే దాని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా బౌలింగ్ పరిశీలిస్తే కొన్ని మ్యాచ్ ల  నుంచి కొత్త బాల్ తో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయలేక పోతున్నారు.. తొలి 20 ఓవర్లలో భాగస్వామ్యాన్ని విడదీయ కపోతే.. ఆ తర్వాత ఎంత బాగా బౌలింగ్ చేసినా ప్రయోజనం ఉండదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రారంభంలో కీలక వికెట్లు పడగొట్టక  పోవడమే టీమిండియా అసలు సమస్య అంటూ చెప్పుకొచ్చాడు టీం ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: