ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా వన్డే టి20 టెస్ట్ సిరీస్లో ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల భారత్ ఆస్ట్రేలియాల మధ్య మొదటి వన్డే సిరీస్ కూడా ప్రారంభమైంది అయితే మొదటి వన్డే సిరీస్లో లోనే శుభారంభం చేసింది ఆస్ట్రేలియా జట్టు. మొదటి నుంచి మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోయింది. మొదటి వన్డే మ్యాచ్లో అత్యధిక స్కోరు చేసిన ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత రెండవ మ్యాచ్ లో  కూడా గెలిచి  ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.




 అయితే మొదటి సిరీస్ గెలుచుకొని ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మంచి దూకుడు మీద ఉన్నప్పటికీ వరుసగా జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ పూర్తిగా దూరం అవుతూ ఉండటం మాత్రం... జుట్టును మరింత బలహీనం గా మారుస్తుంది అనే చెప్పాలి. మొదటి వన్డే మ్యాచ్లో గాయం కారణంగా స్టాయినిస్  జట్టుకు దూరమయ్యాడు అనే విషయం తెలిసిందే. రెండవ వన్డే మ్యాచ్లో గాయం బారినపడిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విలవిలలాడుతూ మైదానాన్ని వదలడు. ఇక గాయం తీవ్రం కావడంతో వార్నర్ కూడా అందుబాటులో ఉండే ప్రసక్తి లేదు ఇక ఇప్పుడు... మరో కీలక ఆటగాడు కూడా జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 పక్కటెముకల గాయం కారణంగా మూడో వన్డే కు దూరమైన పేసర్ మిచెల్  స్టార్క్ ... భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మొదటి టి20 ఆడటం ప్రస్తుతం కష్టంగానే మారింది. తొలి రెండు వన్డేల్లో ఎంతో ఇబ్బంది పడుతూనే ఆడిన మిచెల్  స్టార్క్ గాయం కారణంగా మూడో వన్డే ఆడలేదు. ఇలా వరుసగా ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. కాగా టీమ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 సిరీస్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా వరుసగా కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం అవుతూ ఉండడం ఆస్ట్రేలియా జట్టును మరింత బలహీన పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: