ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా లో వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ అందుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత రెగ్యులర్ కెప్టెన్ లు  గైర్హాజరు తో కెప్టెన్గా కూడా అవకాశం అందుకున్నాడు. ఈక్రమంలోనే టెస్టు సిరీస్లో భాగంగా ఒక టెస్ట్ మ్యాచ్ కి కెప్టెన్సీ వహించగా రోహిత్ శర్మ గైర్హాజరీతో ఇక వన్డే సిరీస్ మొత్తాన్ని కె.ఎల్.రాహుల్ తన కెప్టెన్సీలో ముందుకు నడిపించాడు. ఇకపోతే కేఎల్ రాహుల్ కు సౌత్ ఆఫ్రికా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. అతను కెప్టెన్సీ వహించిన అన్ని మ్యాచ్ లలో కూడా టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో రాహుల్ కెప్టెన్గా పనికిరాడు అతనికి అంత సీన్  లేదు అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు .


 ఇక తాజాగా సౌతాఫ్రికాలో ఓటమి పై కె.ఎల్.రాహుల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో మార్పు ఎంతో అవసరమని రాహుల్ చెప్పుకొచ్చాడు. 4,5 ఏళ్ల నుంచి జట్టు ఎంతో సమర్థవంతంగా రాణి రాణిస్తున్నప్పటికీ  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం జట్టు మరింత మెరుగ్గా రాణించాలంటే తప్పనిసరిగా మార్పు అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియాకు కెప్టెన్గా అవ్వాలి అనే కల సహకారం అయింది. ఇంతకుమించిన గౌరవం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.. దక్షిణాఫ్రికాలో ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది అంటూ తెలిపాడు.


 అయితే జట్టును సమర్థవంతంగా నడిపించగలనూ అన్న నమ్మకం నాకు ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనే నేను అనుకోవడం లేదు. కానీ జట్టుగా మేము ఇంకా మంచి ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది అంటూ కె.ఎల్.రాహుల్ తెలిపాడు. ఇక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ కె.ఎల్.రాహుల్ అన్నాడు. అయితే విజయాల  నుంచి కాదు పరాజయాల నుంచే ఎన్నో నేర్చుకుని మరింత మెరుగ్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే అన్ని విషయాలను నేర్చుకుంటున్నాను అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: