సాధారణంగా కెప్టెన్సీ నిర్వహించడం ఎంతో మంది భారం గా భావిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అదే కెప్టెన్సీ కొత్త ఊపును ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా మారిపోయిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ కేటగిరి లోకి వస్తాడు అని చెప్పాలి. మొన్నటి వరకు కేవలం బౌలర్గా జస్ప్రిత్ బూమ్రా అదరగొడతాడు  అన్నది మాత్రమే అందరికీ తెలుసు.  కానీ ఇప్పుడు మాత్రం బ్యాటింగ్లో కూడా దుమ్ము దులిపేశాడు. ఇంగ్లాండ్ జట్టులో సీనియర్ పేసర్ గా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.


 మొదటి బంతికే ఫోర్ కొట్టిన జస్ప్రిత్ బూమ్రా ఆ తర్వాత బంతికి సిక్సర్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతకుముందు 5 వైడ్స్ తో అదనంగా ఐదు పరుగులు వచ్చాయి. మళ్ళీ మధ్యలో ఒక నో బాల్. ఇక మొత్తంగా ఓవర్ ముగిసే సరికి బూమ్రా 29 పరుగులు చేయగా.. అదనంగా ఆరు పరుగులు రావడంతో మొత్తంగా ఒకే ఓవర్లో 35 పరుగులు సంపాదించాడు బుమ్రా. ఈ క్రమంలోనే 2007లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించిన యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్ ని గుర్తు చేశాడు జస్ప్రిత్ బూమ్రా. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఏంటిది... ఇది బుమ్రానా లేక భువినా.. 2007 ఇన్నింగ్స్ గుర్తుకు వచ్చింది అంటూ యువరాజ్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా లను ట్యాగ్ చేశాడు సచిన్ టెండూల్కర్. ఇక కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే కాదు. మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఊహించని బూమ్రా సర్ప్రైస్ ఇన్నింగ్స్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇప్పుడు వరకు అటు జస్ప్రిత్ బూమ్రా కానీ మరోవైపు యువరాజ్ సింగ్ గాని ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: