గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్ లేని కారణంగా ఎంత ఇబ్బందులు పడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిసిసీఐ అతనికి ఎన్ని అవకాశాలు ఇస్తూ వస్తున్నప్పటికి కూడా అతను మళ్ళీ నిరూపించుకో లేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కోహ్లీ ని జట్టు నుంచి పక్కకు పెట్టాలి అంటూ డిమాండ్లు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో కోహ్లీ త్వరలో ఫాంలోకి వస్తాడని మళ్లీ పరుగుల వరద పారిస్తాడు అని అతనికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఇటీవలే టీం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ప్రదర్శనతో నిరాశపరిచాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో పేలవా ప్రదర్శన నేపథ్యంలో  అటు వెస్ట్ ఇండీస్ టూర్ కు విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయలేదు టీమిండియా.  విరాట్ కోహ్లీకి విశ్రాంతి ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ తో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లకు కూడా విశ్రాంతి ప్రకటించింది. అయితే మళ్లీ టి20 సిరీస్కు ఎంపిక చేసింది. అయితే కోహ్లీని మాత్రం ఎంపిక చేయలేదు. ఇలాంటి సమయంలోనే ఇదే విషయంపై స్పందించాడు భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా.



 ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వకుండా వెస్టిండీస్తో జరిగే టి20 సిరీస్ కు ఎంపిక చేస్తే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ గత పదేళ్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేశాడని గుర్తుచేశాడు ప్రజ్ఞాన్ ఓజా. ఇలా మూడు ఫార్మాట్లలో ఇంత అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు చాలా తక్కువగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే వెస్టిండీస్ లో టి20 సిరీస్ కు విరాట్ కోహ్లీ ఎంపిక చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: