జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ కి ముందు ఇలాంటి కీలక ఆటగాడు దూరం అవ్వడం అటు టీమిండియా కు ఊహించిన ఎదురుదెబ్బ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అటు బుమ్రా లాంటి కీలక బౌలర్ లేకుండా టీమిండియా వరల్డ్ కప్ లో ఎలా రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి బుమ్రా లేకుండా టీమిండియా బౌలింగ్ విభాగం పేలవ ప్రదర్శన చేస్తుంది.


 ఏ ఒక్క బౌలర్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నాడు అని చెప్పాలి. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అటు వికెట్లను పడగొడుతూ పరుగులను కట్టడి చేయాల్సిన బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ల విధ్వంసానికి ఒత్తిడిలో కూరుకు పోతున్నారు. తద్వారా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా బుమ్రా లేకపోవడంతో డెత్ ఓవర్లలో ఎంతో మంది బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల బుమ్రా గాయం కారణంగా దూరం కావడంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు.


 తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే టీ20 మెగా టోర్నీలో జట్టును విజయపథంలో నడిపిస్తాడు అని అందరూ భావించిన స్టార్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా జట్టు నుంచి వైదొలగడం టీమిండియా కు పెద్ద ఎదురుదెబ్బ అంటూ భారత మాజీ ఆటగాడు కామెంటెటర్  ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.. ఆసియా కప్ మాదిరిగానే టీమిండియా వరల్డ్ కప్ లో కూడా టీమిండియా భారీ మూల్యంచెల్లించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ముగ్గురు బౌలర్లతో ఆసియా కప్ లోకి వెళ్లి నిరాశపరిచిన టీమిండియా వరల్డ్ కప్ కోసం మాత్రం అలాంటి తప్పు చేయకూడదు అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: