బ్యాంకుల ద్వారా లేదా ఇతర యాప్ ల ద్వారా డబ్బు లావాదేవీలు జరపాలంటే కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే. లేకపోతే 50 వేల రూపాయలకు మించి మనం డబ్బులు బదిలీ చేయలేము. ఇక ప్రతి ఒక్కరికి ఈ పాన్ కార్డు తప్పనిసరి అయ్యింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ పాన్ కార్డుకు సంబంధించిన అన్ని విషయాలను జాగ్రత్తగా పొందుపరచాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎమర్జెన్సీగా అప్లై చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ఇచ్చి వీటిని చేయించుకుంటూ ఉంటాము.

అయితే తీరా పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అయ్యో ఇందులో ఫోటో బాగా లేదే అంటూ బాధపడిపోతూ ఉంటాము. అంతేకాదు అప్పుడే మంచి ఫోటో ఇచ్చి ఉంటే బాగుండేదేమో.. ఇప్పుడైనా కనీసం ఫోటో మార్చు కునే ఆప్షన్ వస్తే బాగుంటుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లో కూడా మీకు నచ్చిన ఫొటోలను పెట్టుకోవచ్చు.పాన్ నెంబర్ అనేది 10 అంకెల ఒక ప్రత్యేక యూనిక్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది  వ్యక్తి యొక్క ఆర్థిక చరిత్రను రికార్డు చేస్తుంది.

ఇకపోతే టెక్నాలజీని ఉపయోగించి పాన్ కార్డు లో ఫోటోలు ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

1. పాన్ కార్డులో ఉన్న వివరాలను ఎడిట్ చేయాలి అంటే ఎన్ ఎస్ డి ఎల్ అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.

2. అప్లికేషన్ ఎంపిక పై క్లిక్ చేసిన తర్వాత చేంజెస్ లేదా ఎడిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. మెనూ క్యాటగిరి లోకి వెళ్లి  పర్సనల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4. ఆ తర్వాత మీకు కావలసిన అన్ని  చేంజ్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేస్తే మిగతా వివరాలతో పాటు ఫోటో ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా మారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: