
అంతేకాదు ఇటీవలే కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అయితే భారీగా ఆదాయం ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు క్రెడిట్ కార్డును మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంతంత మాత్రం వేతనాలు ఉన్న వారికి సైతం క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఆర్థిక అవసరాలను క్రెడిట్ కార్డుల ద్వారానే తీర్చుకోగలుగుతున్నారు. అంతే కాకుండా క్రెడిట్ కార్డు వినియోగించిన తర్వాత.. తిరిగి చెల్లించే గడువు ఒక నెల కంటే ఎక్కువగా ఉంటుండడంతో.. సామాన్యులకు కూడా ఈ క్రెడిట్ కార్డు సౌకర్యాలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అందుకే అందరూ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
క్రెడిట్ కార్డు లిమిట్ ని ఉపయోగించుకోవడం తమ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత కట్టేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం క్రెడిట్ కార్డు బిల్లు కట్టే గడువు గురించి మర్చిపోతూ చివరికి ఫైన్ కడుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి వారికే ఇటీవల ఆర్.బి.ఐ గుడ్ న్యూస్ చెప్పింది. గడువు దాటిన మూడు రోజుల లోపు బిల్లు చెల్లిస్తే బ్యాంకులు పెనాల్టీ విధించదు. అంతేకాగా సిబిల్ స్కోర్ కూడా తగ్గదు. మూడు రోజుల తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతే మాత్రం తప్పకుండా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.