ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచం అంతా స్మార్ట్ ఫోన్‌ల మ‌యం అయిపోయింది. ఎవ‌రి చేతులో చూసినా స్మార్ట్‌ఫోన్ ద‌ర్శ‌నం ఇస్తుంది.  మొబైల్‌ ప్రపంచంలో పెను మార్పును తెచ్చింది. ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చిపెట్టంది. ఈ క్ర‌మంలోనే స్మార్ట్‌ఫోన్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. అయితే దీన్నే కొందరు అదునుగా తీసుకుని మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా న‌కిలీ స్మార్ట్‌ఫోన్ల‌తో చాలా మంది మోస‌పోతున్నారు. ఎందుకంటే ఏది ఒరిజిన‌ల్ స్మార్ట్‌ఫోన్‌.. ఏది న‌కిలీ స్మార్ట్‌ఫోన్ అనే అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే.

 

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ న‌కిలీ స్మార్ట్‌ఫోన్ల‌ను గుర్తించ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. హార్డ్‌వేర్ బటన్‌ను బాగా పరిశీలించటం ద్వారా నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించవచ్చు. ఎందుకంటే.. ఒరిజనల్ స్మార్ట్‌ఫోన్‌కు  హార్డ్‌వేర్ బటన్ ప్రొఫెషనల్ లుక్‌తో ధృడంగా ఉంటుంది. కానీ, నకిలీ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రం హార్డ్‌వేర్ బటన్ నాసికరమైన లుక్‌తో క‌నిపిస్తుంది. స‌గానికి సగం తగ్గింపు ఇంకా గంట మాత్రం సమయముందంటూ ఆన్‌లైన్ యాడ్స్‌ను అస్స‌లు న‌మ్మ‌కండి.

 

ఎందుకంటే.. అవ‌న్నీ న‌కిలీ స్మార్ట్‌ఫోన్లు కాబ‌ట్టి. అలాగే గ్యారంటీ ఇంకా వారంటీ బట్టి నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను క‌నిపెట్ట‌వ‌చ్చు. ఇక నకిలీ వర్షన్ స్మార్ట్‌ఫోన్ నాసిరకమైన డిజైనింగ్‌ను కలిగి ఉంటుంది. మ‌రియు నకిలీ ఫోన్ కలర్ కాంతిహీనంగా, ఎట్రాక్టీవ్‌గా క‌నిపిస్తుంది. అలాంటివి కూడా కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా, నకిలీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి లోగో ఇంకా ప్యాకేజింగ్ నాసిరకంగా ఉంటుంది. దీని బ‌ట్టీ కూడా న‌కిలీ స్మార్ట్ఫోన్‌ను గుర్తించ‌వ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: