శాంసంగ్ మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఈ కంపెనీ ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫోన్లను విడుదల చేసింది. మార్కెట్ లోకి విడుదల అవుతున్న ఫోన్ లు అన్నీ కూడా మంచి సేల్స్ ను అందుకున్నాయి. ఈ మేరకు కంపెనీ ఇప్పుడు మరో ఫోన్ ను లాంచీ చేసింది. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..


శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 5వ తేదీన లాంచ్ చేయనుంది. ఇప్పుడు లాంచ్‌కు ముందు ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో లీకైంది. ప్రముఖ టిప్ స్టర్ ఇషాన్ అగర్వాల్ తెలుపుతున్న దాని ప్రకారం గెలాక్సీ ఏ32 4జీ ధర 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉండనుంది.గెలాక్సీ ఏ32 మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ సంవత్సరం గెలాక్సీ ఏ12 తర్వాత ఆ సిరీస్‌లో వచ్చే ఫోన్ ఇదే. ఇటీవలే ఈ ఫోన్ వేరే దేశంలో లాంచ్ అయింది. నాలుగు కలర్ ఆప్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి.


ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు., వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. మొత్తానికి ఈ ఫోన్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: