ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ త్వ‌ర‌లో లాంచ్ చెయ్యబోతున్న కొత్త ఫోన్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేష‌న్లు లీక్ అయ్యాయి.సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఈ నెల‌లో భార‌త్ లో విడుద‌ల చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు లీకైన గెలాక్సీ ఎం 32కి ఫోన్ స్పెసిఫికేష‌న్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం...శాంసంగ్ గెలాక్సీ ఎం 32 స్మార్ట్ ఫోన్ వచ్చేసి జూన్ నాలుగో వారంలో ఇండియాలో విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభం ధ‌ర వచ్చేసి రూ.15వేల నుంచి రూ.20వేల మ‌ధ్య‌లో ఉంటుందని సమాచారం అందుతుంది.


ఇక ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ఫోన్ ఫోటోలు ఇప్ప‌టికే శాంసంగ్ ఆఫీషియల్ వెబ్‌సైట్ లో బ్యాక్ ప్యానెల్,స్వైర్ షేప్ కెమోరా మాడ్యుల్, ఇన్ఫినిటీ-యు కటౌట్‌తో డిజైన్లను పోస్ట్ చేసి ఉంది.ఇక కలర్స్ విషయానికి వస్తే బ్లాక్‌, బ్లూ, వైట్ క‌ల‌ర్స్ తో మార్కెట్ లో ఈ ఫోన్ విడుద‌ల కానుంది.ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే గెలాక్సీ ఎం 32 లో ఇన్ఫినిటీ-యు డిజైన్ తో 6.4-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.ఇక ఈ సూపర్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్ పనిచేస్తుంది. అలాగే 4GB ram + 64GB ఇంకా 6GB ram + 128GB ఇంట్ర‌ర్న‌ల్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.


ఇక కెమెరా విషయానికి వస్తే గెలాక్సీ ఎం 32 క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.అంతేగాక ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ తో ఈ స్మార్ట్ ఫోన్ వ‌స్తుంది.గెలాక్సీ ఎం 32 బ్యాటరీ విషయానికి వస్తే ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వ‌స్తుంది.అంతేగాక ఇది వన్ యుఐ లేయర్‌తో ఆండ్రాయిడ్ 11 పైన రన్ చేస్తుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.అంతేగాక దీనికి 1 టీబీ వరకు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: