వాడ‌కం బాగుంది కానీ వాత‌లే ..

డేటా రేటు భ‌లే ఉంది
వాడ‌కం అలానే ఉంది
వాత‌లూ అలానే ఉన్నాయి
ఇప్పుడేం చేద్దాం?
వాడ‌కం అల‌వాటు చేసింది జియో
వాత‌లు పెడుతోంది ఇంకొన్ని కంపెనీలు
ఇండియాలో అంతా ఇంతేనయా!
ఇక టెలికాం రంగంలో విప్లవం అన్న మాట వినిపించ‌కండి ప్లీజ్ !

క‌రోనా వ‌చ్చాక ఇళ్ల‌కే ప‌రిమితం..అయిన జ‌నానికి నెట్ ఓ రిలీఫ్ ..కానీ ఇదే అద‌నుగా డేటాను వాడుకునే వారికి  ఛార్జీల వ‌డ్డ‌న త‌ప్ప‌డం లేదు. మొద‌ట్లో ఉన్నంత‌గా ఇప్పుడు జియో సేవ‌లు త‌క్కువ ధ‌ర‌ల‌కు అందుబాటు లోకి రాక‌పోవ‌డంతో  మోడీ చెప్పే డిజిట‌ల్ ఇండియా అన్న‌ది  సాధ్యం అయ్యేలా లేదు.వివరాలిలా ఉన్నాయి.దేశ వ్యాప్తంగా డిజిట‌ల్ విప్ల‌వం  తేవాల‌న్న మోడీ సంక‌ల్పం హుష్ కాకీ అవుతోంది. ఆయ‌న ఆశ‌లు గ‌ల్లంత‌వుతు న్నాయి. ము ఖ్యంగా డేటా ప్రొవైడ‌ర్లంతా దిగి రాక‌పోడంతో సంబంధిత ధ‌ర‌లు నింగిని చూస్తున్నాయి త‌ప్ప నేల‌కు దిగి రావ‌డం లేదు. దీంతో డి జిట‌ల్ ఇండియా అన్న మాట కు అర్థం లేకుండా పోతోంది. క‌రోనా కార‌ణంగా యూజ‌ర్స్ పెరిగినా ఆ స్థాయికి అనుగుణంగా సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగినా వాత‌లు మాత్రం త‌ప్ప‌డం లేదు. మ‌న దారిలోనే అమెరికా కూడా ప్ర‌యాణిస్తోంది అని తెలుస్తోంది. అదేవిధంగా చైనాలో కూడా డేటా ఛార్జీలు ఎక్కువే! మ‌న క‌న్నా సుడాన్ లో ఛార్జీలు త‌క్కువ అని అక్క‌డ ఒన్ జీబీ డేటాకు 20 రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నార‌ని స‌మాచారం. అగ్ర‌దేశాలు అయిన రష్యా లో కూడా ఒన్ జీబీ డేటా ఛార్జీ 21 గా ఉంది.

జియో త‌ప్పిదం కార‌ణంగా
ఇప్పుడొస్తున్న డేటా ప్రొవైడ‌ర్లు కూడా
త‌మదైన ధ‌ర‌ల ద‌రువు త‌ప్ప‌క మోగిస్తున్నారు

స‌మాచార విప్లవం పేరిట  నానా హంగామాచేసిన జియో త‌రువాత చేతులెత్తేసింది. ఒక జీబీ కి మ‌న దేశంలో మ‌నం చెల్లిస్తున్న మొత్తం యాభై రూపాయ‌లు. అదే ఇజ్రాయెల్ లో అయితే మూడు రూపాయ‌లే.. మ‌న‌క‌న్నా శ్రీ‌లంక, బంగ్లాదేశ్ దేశాలు త‌క్కువ ధ‌ర‌కే నెట్ అందిస్తున్నా భార‌త్ మాత్రం య‌మా కాస్ట్లీగా వ్యాపారం చేస్తోంది. దీంతో నెట్ యూజ‌ర్స్ పెరిగినా డేటా ఛార్జీలు త‌గ్గ‌డం లేద‌ని వినియోగ‌దారులంతా వాపోతున్నారు.

ఆన్లైన్ త‌రగతుల పేరిట
దేశ‌వ్యాప్తంగా హంగామా న‌డుస్తున్న
ప్ర‌స్తుత త‌రుణంలో త‌క్కువ రేటుకే
డేటా అందించ‌కుంటే ప‌క్క‌నున్న దేశాల
కంటే భార‌త్ నిజంగానే వెనుక‌బ‌డిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

4g