
ONEPLUS NORD CE-2 5G:
90 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో 6.43 అంగుళాల పొడువుతో ఈ ఫోన్ మనకు లభిస్తుంది. ఇందులో హెచ్డీ డిస్ ప్లే తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్ తో మనకు స్మార్ట్ఫోన్ లభిస్తుంది. ఈ మొబైల్ లో సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ 11.1 తో నడుస్తుంది. అంతేకాదు దీర్ఘచతురస్రాకారం ఉంచబడిన ట్రిపుల్ రియర్ కెమెరాను కూడా కలిగి ఉండడం గమనార్హం. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 64 మెగాఫిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు..119 డిగ్రీలో ఫీల్డ్ ఆఫ్ యూ తో 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అలాగే 2 మెగాపిక్సల్ సెన్సార్లు ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఇకపోతే 128gb ఆన్బోర్డ్ స్టోరేజ్ తో మనకు ఈ స్మార్ట్ఫోన్ లభించడం గమనార్హం.
ఫైవ్ జి కనెక్టివిటీ తో ఈ మొబైల్ పనిచేస్తుంది.. USB టైప్ సీ పోర్ట్ కూడా అమర్చబడి ఉంది. ఇక ఈ ఫోన్ కలర్ విషయానికి వస్తే బహమాస్ బ్లూ, గ్రే మిర్రర్ కలర్ ఆప్షన్ లో లభించడం గమనార్హం . ఇక స్టోరేజ్ అలాగే ధర విషయానికి వస్తే..6GB + 128 GB స్టోరేజ్ ఈ మొబైల్ మనకు.. రూ.23,999 లభిస్తుంది. 8GB + 128 GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.24,999 ధర పలకనుంది.. ప్రస్తుతం ఈ మొబైల్స్ అందుబాటులో లేవు కానీ ఫిబ్రవరి 17 నుంచి ఆన్లైన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి..