ఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి అంటే అందుకు ముఖ్య కారణం షావోమి సమస్త అని చెప్పవచ్చు. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత సామాన్యులు సైతం మొబైల్స్ తక్కువ ధరకే తీసుకుంటున్నారు. అయితే ఈ మొబైల్స్ లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య కేవలం బ్యాటరీ ప్రధానమైనదని చెప్పవచ్చు. కొన్ని రోజులు వాడగానే బ్యాటరీ సమస్యలు వస్తున్నాయని పలువురు కస్టమర్లు ఆ సంస్థకు తెలియజేయడం జరిగిందట. ఇక అంతే కాకుండా ఈ కంపెనీ తయారు చేసిన బ్యాటరీలు దొరకడం అంత సులువైన విషయం కాదు.


అందుచేతనే షావోమీ బ్రాండ్ కు చెందిన రెడ్మి, ఏంఐ ఫోన్లను కొన్ని నాన్ రియూవబుల్ బ్యాటరీని ఫోన్లలో బ్యాటరీలను అంత సులువుగా మార్చలేమని చెప్పవచ్చు ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ సమస్త సరికొత్త నిర్ణయం తీసుకున్నది. బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక ఇందులో భాగంగానే రూ.499 రూపాయలకి కొత్త బ్యాటరీని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ఒక వీడియో రూపంలో అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు షావోమి యాజమాన్యం.


బ్యాటరీని మార్చుకోవడానికి దగ్గరలో ఉన్న షావోమి  సర్వీస్ సెంటర్ కు వెళ్ళ వచ్చని కంపెనీ సూచిస్తోంది. అంతేకాకుండా ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని తెలియజేసింది.షావోమి సర్వీసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ స్మార్ట్ మొబైల్ వివరాలను ఎంటర్ చేసి ఆ తర్వాత నేరుగా సర్వీస్ సెంటర్ కి వెళ్తే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చని తెలియజేసింది. బ్యాటరీ ప్రారంభం ధర రూ.499 ఉంటుందని తెలియజేసింది. అయితే మొబైల్ మోడల్ ను బట్టి ధర మారుతూ ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ఇతర కంపెనీలకు చెందిన బ్యాటరీలను  ఉపయోగించడం వల్ల ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుందని అందుచేతనే ఇలాంటి సరికొత్త ప్రోగ్రామును తీసుకువచ్చామని అధికారులు తెలియజేశారు. ఎంఐ మొబైల్స్ ఉపయోగించే వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: