ప్రస్తుతం చాలామంది ఎన్నో రకాల ఉత్పత్తులను సైతం కొనుగోలు చేస్తూ ఉంటారు.. అంతేకాకుండా వాటిని తీసుకునే ముందు కచ్చితంగా వారంటీ గ్యారెంటీ వంటివి మనం పరిశీలిస్తూ ఉంటాము.. అయితే కేవలం ఇవి నామమాత్రానికే మనం చూస్తూ ఉన్నప్పటికీ వీటి మధ్య తేడాలు మాత్రం చాలా మందికి తెలియక పోవచ్చు.. అయితే ఇలాంటి వారంటీ గ్యారెంటీ కార్డులను సైతం ధ్రువీకరించడానికి ఖచ్చితంగా వారంటీ కార్డు లేదా బిల్లు వంటివి ఉండాల్సిందే.. మరి గ్యారెంటీ వారంటీ అనే వాటికి మధ్య తేడా ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

1). వారంటీ:
ఏదైనా ఒక వస్తువుని మనం కొన్నప్పుడు ఆ వస్తువు పాడైతే అది ఉత్పత్తి చేసిన దుకాణదారుని సంస్థ రిపేర్ చేసి కస్టమర్కు సైతం అందించేటువంటి పత్రాన్ని వారంటీ అంటారు.. అయితే దీనిని పొందడానికి పలు రకాల కండిషన్స్ కూడా ఉంటాయట.. ఇది ధ్రువీకరించిన బిల్లు లేదా వారంటీ కార్డు తోనే క్లియర్ చేసుకోవాలి.. ఆ వస్తువు యొక్క నిర్దిష్ట వారంటీ కాలానికి మాత్రమే ఉపయోగపడుతుంది.. వాస్తవానికి ఒక ఏడాది పాటు ఈ వారంటీ అనేది ఉపయోగపడుతుంది. సమయం ముగిసిన తర్వాత వినియోగదారుడు ఆ ఉత్పత్తిని తీసుకొని రిపేరు చేయమంటే అది దుకాణదారుడు బాధ్యత కాదు..


2). గ్యారెంటీ:
 ఏదైనా వస్తువుని కొన్నప్పుడు ఉత్పత్తి ఏడాదిలోపే పాడైన ఉత్పత్తి పైన ఒక ఏడాది పాటు గ్యారంటీ రాసి ఉంటే కచ్చితంగా దుకాణదారుడు కస్టమర్కు సైతం కొత్త ఉత్పత్తిని అందించాల్సి ఉంటుంది.. అందుకే పాత లేదా పాడైన వస్తువులను బదులుగా కొత్త వస్తువులను సైతం ఇవ్వడాన్నే గ్యారెంటీ అంటారు.. ఇది కూడా వారు ఇచ్చిన గడువులోపు మాత్రమే వర్తిస్తుంది..


వారంటీ గ్యారెంటీ మధ్య తేడా విషయానికి వస్తే.. వారింటి అనేది నిర్మినిత వ్యవధిలో మాత్రమే ఉంటుంది ఎక్కువ కాలం వీటిని పొడిగించారు.. అలాగని గ్యారెంటీ ని కూడా పొడిగించలేరు.. ప్రతి ఉత్పత్తుల పైన వారంటీ కచ్చితంగా అందుబాటులో ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన వస్తువుల పైన మాత్రమే గ్యారెంటీ అనేది అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: