కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో అడుగు పెట్టి ప్రజల జీవన శైలిని తారుమారు చేసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక మాన్యాలను అతలాకుతలం చేసింది. అది ఇది అని దేనినీ వదలకుండా.. అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపి ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. కరోనా నేపథ్యంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు... వేలాది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దగ్గరగా చేరాయి. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ప్రజలు బ్రతుకు జీవనం లేక రోడ్డున పడ్డారు. అయితే దేశమంతటా అన్ లాక్ డౌన్ ప్రక్రియలు దశలవారీగా మొదలుకాగా... వ్యాపార సంస్థలు, ట్రాన్స్పోర్ట్, సినీ పరిశ్రమలు... ఇలా అన్ని రంగాల వారు తమ తమ పనులను ప్రారంభించాయి.

దాంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కానీ జరిగిన నష్టాన్ని భర్తీ చేసి తిరిగి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవాలంటే ఇంకొంతకాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తిరిగి ప్రారంభమైన వ్యాపార సంస్థలు మళ్లీ ఉద్యోగులను పనిలోకి తీసుకుంటున్నాయి... కొన్ని కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. అలాంటి వాటిలో... కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత అవి మీకు సెట్ అవుతాయి అనుకుంటే ఒకసారి దరఖాస్తు చేసి చూడండి. ఇప్పుడు అవి ఏంటో వాటి వివరాలు ఏంటో ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.....

1. ప్లేస్‌మెంట్ ఇండియా (Placement India)
ఇందులో అభ్య‌ర్థులు త‌మ‌కు కావ‌ల్సిన జాబ్ కోసం స‌క్సెస్ ఫుల్ ప్రొఫైల్‌ను బిల్డ్ చేసుకోవ‌చ్చు. దాని కొరకు ప‌లు టూల్స్ ఉంటాయి. వాటితో జాబ్‌ను సుల‌భంగా చూసి ఎంచుకోవచ్చు.

2. వ‌సిట‌మ్ (Vasitum)
 ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ సైట్ ప‌నిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ హైరింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల టాలెంట్ ఉన్న‌వారికి చాలా సుల‌భంగా జాబ్ వ‌చ్చేందుకు ఇందులో అవ‌కాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసి చూడండి.

2. ఇండీడ్ ( Indeed)
దేశంలోని ప్ర‌ముఖ జాబ్ పోర్టల్స్‌లో ఇండీడ్ కూడా ఒక‌టి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఇందులో సెర్చ్ చేయవచ్చు. క‌రోనా వైర‌స్ వ‌ర్క్ టూల్స్‌ను ఇందులో అందిస్తున్నారు.

4. మాన్‌స్ట‌ర్ (Monster)
ప్ర‌ముఖ జాబ్ పోర్ట‌ల్స్ లో ఇది కూడా ఒక‌టి. ఇందులో ఇండియ‌న్ జాబ్ సీక‌ర్స్‌, రిక్రూట‌ర్స్ కోసం ప్ర‌త్యేక ఆప్ష‌న్లు ఇచ్చారు. అభ్య‌ర్థులు సుల‌భంగా జాబ్స్ సెర్చ్ చేయడానికిఇది వీలుగా ఉంటుంది.

5. షైన్ (Shine)
దేశంలో షైన్ ద్వారా ఇప్పటికే 3 ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగాలు పొందారు. జాబ్ సీక‌ర్స్‌, రిక్రూట‌ర్ల‌కు ఇది కూడా ఒక  మంచి వేదికనే అని చెప్ప‌వ‌చ్చు. దీంట్లో కూడా నిరుద్యోగులు సుల‌భంగా ఉద్యోగాల కోసం సెర్చ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: