
తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలో స్టార్ రైటర్ అవార్డులు... ఇండియా హెరాల్డ్ ' కోటిరెడ్డి ' కే సొంతం

అయితే.. ఈ సైట్‌లో వార్తలు, కథనాలు చాలా భిన్నంగా ఉంటాయి. సాధారణ మూస ధోరణిలో కాకుండా.. పాఠకులను ఆకట్టుకునేలా భిన్నశైలిలో వెబ్‌సైట్ అలరిస్తోంది. దీనికి కారణం ఈ వెబ్‌సైట్‌లో పనిచేసే ప్రతి జర్నలిస్టును ప్రోత్సహించడమే. ప్రతిరోజూ.. ఈ సైట్‌లో రాసే ఆథర్స్‌ను ప్రోత్సహించడమే కాకుండా.. వారికి నగదు బహుమతులు అందిస్తూ.. అవార్డులు ప్రకటిస్తున్నారు. దీంతో పోటీ తత్వం పెరిగి.. సైట్‌లో భిన్నమైన వార్తలు రావడంతోపాటు.. ప్రతి ఒక్కరినీ అలరించే కథనాలు వస్తున్నాయి.
అవార్డుల విషయానికి వస్తే కరోనా సెకండ్ వేవ్ ముందు వరకు.. ప్రతిరోజూ.. అత్యుత్తమంగా వచ్చిన కథనాలు వార్తలను తదుపరి రోజు ఉదయం 8 గంటలకే ఎంపిక చేసి.. స్టార్ రైటర్ అవార్డులను అందిస్తున్నారు. ఫస్ట్ స్టార్ రైటర్ ఆఫ్‌ది డేకు రూ.1516, సెకండ్ స్టార్ రైటర్ ఆఫ్‌ది డేకు రూ.1116లను అప్పటికప్పుడు ఆయా రచయితల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెలా..మంత్లీ స్టార్ రైటర్ అవార్డును కూడా కోటిరెడ్డి అందిస్తున్నారు. గడిచిన నెలలో.. ఎక్కువ సార్లు అవార్డులు అందుకున్న ఆథర్లను ఎంపిక చేసి.. వారికి మంత్లీ అవార్డులు ఇస్తున్నారు. వీరు స్టార్ రైటర్ ఆఫ్ ద డే అవార్డులకు ఎంత నగదు గెలుచుకున్నారో అంతకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా స్టార్ ఆఫ్ ద మంత్లీ అవార్డులు గెలుచుకున్న ఆధర్స్‌కు ప్రశంసా పత్రం, మెమెంటోను ఇంటికే పంపిస్తూ.. ప్రోత్సహిస్తున్నారు.
అలాగే పోర్టల్లో పనిచేసే ఆథర్స్‌కు ఎన్నికల టైంలో ప్రతి రోజు బెస్ట్ ఆర్టికల్ ఆథర్‌కు ప్రతి రోజు ఓ ఖరీదైన గిప్ట్‌తో పాటు టోటల్ ఎన్నికల కవరేజ్‌లో ది బెస్ట్ ఆథర్‌ను ఎంపిక చేసి రు. 80 వేల విలువ చేసే బైక్‌ను గిఫ్ట్‌గా ప్రజెంట్ చేశారు. 2019, 2024 రెండు ఎన్నికల్లోనూ ఇద్దరు ఆథర్స్‌కు బైక్‌లు గిఫ్ట్‌లుగా ఇచ్చిన హిస్టరీ కూడా కోటిరెడ్డి సొంతం. ఇలా.. తన వద్ద పనిచేసే ఆథర్లను నిరంతరం ప్రోత్సహిస్తూ.. వెబ్ హిస్టరీలోనే ఒక నూతన అధ్యాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇండియా హెరాల్డ్ పుష్కర కాలంగా తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలో తనదైన శైలీలో ప్రజలను మెప్పించే కథనాలతో.. మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో దూసుకుపోతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు