
ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటించిన సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు . కానీ హరిహర వీరమల్లు సినిమా ఇంత పెద్ద హిట్ అయితే టాప్ హీరోస్ ఎవ్వరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేయకపోవడం ఆయనని అభినందించకపోవడం విడ్డూరంగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.
ఆయనతో ఏదైనా పనులు ఉంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకుని మరీ మీటింగులు గంటలు గంటలు పెట్టుకుంటూ ఉంటారు అని .. కానీ పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి నటించిన సినిమా హిట్ అయితే బాగుంది అని చెప్పడానికి వీళ్లకి టైమే లేకుండా పోయింది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు కావాలనే పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి చూసిన వాళ్లు ఆయన సినిమా హిట్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు . కొంతమంది పవన్ కళ్యాణ్ కి తెలుగు ఇండస్ట్రీలో కూడా శత్రువులు ఉన్నారు అని ఆయన వెనకే ఉంటూ ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని.. ఆ విషయం పవన్ కళ్యాణ్ గమనిస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా హిట్ టాక్ పై ఎటువంటి రియాక్షన్ లేకపోవడం ఇప్పుడు అందరికీ కొత్త డౌట్లు పుట్టుకొచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీనిపై ఫైర్ అయిపోతున్నారు..!!