తాడిపత్రి రాజకీయం అటు వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జెసి కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. వైసిపి హయాంలో జెసి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారంటూ గత కొద్ది రోజులుగా జెసి ప్రభాకర్ రెడ్డి కూడా పలు రకాల ఆరోపణలు చేశారు. అయితే తాడిపత్రిలో జరుగుతున్న రాజకీయరగడపై తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.


జెసి ప్రభాకర్ రెడ్డి పైన ఆయన కుటుంబ సభ్యుల పైన పెట్టిన కేసులు అన్ని తప్పుడు కేసులు కావని అందుకు తగ్గట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయంటూ తెలిపారు. పెద్దారెడ్డి. తాడిపత్రి టిడిపి నేత ప్రభాకర్ రెడ్డి  పై ఎలాంటి కేసులు ఉన్నాయో అందరూ ఆలోచించాలి.. ముఖ్యంగా సుప్రీంకోర్టు నిషేధించిన BS -3 వెహికల్స్ ను జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసిందని.. అలాగే ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ నాగాలాండ్ లో చేయించారని.. వీటి పైన సుమారుగా 100 కేసులు పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి పైన నమోదయాయని తెలిపారు పెద్దారెడ్డి.


జెసి ట్రావెల్స్ లో కుటుంబ సభ్యులే డ్రైవర్లుగా ఉండడం వల్లే ఆయన కుటుంబ సభ్యుల పైన ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగం కాదనే  విషయాన్ని నారా లోకేష్, చంద్రబాబు కూడా గ్రహించాలి అంటూ తెలిపారు. ఈ కేసులన్నీ రద్దు చేయించుకునేందుకు జెసి ప్రభాకర్ రెడ్డి పెద్ద ఎత్తుగడే వేస్తున్నారు అంటూ తెలిపారు. తాను జెసి ప్రభాకర్ రెడ్డి భార్యను, ఆయన కుటుంబ సభ్యులను ఎప్పుడూ కూడా దూషించలేదంటూ తెలిపారు. ఒకవేళ తాను దూషించినట్లుగా ప్రభాకర్ రెడ్డి భార్య ఉమక్క చెబితే కచ్చితంగా క్షమాపణలు చెబుతానని తెలిపారు.


నా కోడలు తాడిపత్రికి వైసీపీ సమావేశంలో పాల్గొంటే అభ్యంతరాన్ని చెప్పడం ఎలాంటి సంస్కారం అంటూ ప్రశ్నించడమే కాకుండా తాడిపత్రి ఏఎస్పి రోహిత్ అవినీతిపరుడు అంటూ ఆరోపించడం కూడా తప్పు అంటూ తెలిపారు పెద్దారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: